Sunday, January 19, 2025
HomeTrending Newsపిలిచి ఇవ్వాల్సిన అవసరం లేదు: వైవీ

పిలిచి ఇవ్వాల్సిన అవసరం లేదు: వైవీ

ఎవరికీ పిలిచి రాజ్యసభ సీటు కేటాయించాల్సిన అవసరం వైసీపీకి లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. జూన్ లో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్ధానాలకు సంబంధించి సిఎం జగన్ దే తుది నిర్ణయమని, అయన ఎవరికి అవకాశం ఇస్తే వారు రాజ్యసభ సభ్యులవుతారని వ్యాఖ్యానించారు.  పార్టీ కోసం పని చేసి.. పార్టీని బలోపేతం చేసేందుకు ఎవరు బాగా ఉపయోగపడతారో వారికి ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారన్నారు.

సినిమా టిక్కెట్ల వ్యవహారాన్ని సీఎంతో చర్చించేందుకే సీఎం జగన్ ను చిరంజీవి కలిశారని, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయనతో మాట్లాడలేదని వెల్లడించారు.  సినీ నటులు చిరంజీవి కూడా ఆ వార్తలను ఖండించారని గుర్తు చేశారు. కరోనా ఉదృతి నేపధ్యంలో స్వామి వారి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ ఏర్పాట్లు చేశామని,  కేసులు ఎన్ని పెరిగినా ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భక్తులు మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని హామీ ఇచ్చారు.  వ్యాక్సిన్ వేయించుకున్న వారు మాత్రమే దర్శనానికి రావాలని సూచించారు.

Also Read : ఆ వార్తలు నిరాధారం : చిరంజీవి

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్