Sunday, June 14, 2026
Homeసినిమాక్రిష్ మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడా..?

క్రిష్ మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడా..?

జాగర్లమూడి క్రిష్ ఎప్పటి నుంచో ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంటే వెనకాల స్టార్ట్ అయిన పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ.. వీరమల్లు మాత్రం ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. ఇటీవల ‘బ్రో’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ డిసెంబర్ లో ‘ఓజీ’ మూవీని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. యాభై శాతంకు పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఓజీని అక్టోబర్ కి కంప్లీట్ చేయాలనేది మేకర్స్ ప్లాన్. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ లో ఓజీ చిత్రాన్ని విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఓజీతో పాటు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను కూడా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారట. ఇక వీరమల్లు వచ్చే ఎన్నికల తర్వాతే. అందుకనే అప్పటి వరకు ఖాళాగా ఉండడం ఇష్టం లేక ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలి అనుకుంటున్నాడట క్రిష్. కథ రెడీ అయ్యిందట. ఇప్పుడు హీరో కావాలి.. హీరోలందరూ బిజీగా ఉన్నారు. అందుచేత కొత్తవాళ్లతో చేద్దామంటే.. ప్రయోగం అవుతుందేమో అని కాస్తో కూస్తో క్రేజ్ ఉన్న హీరోతోనే చేయాలని ఫిక్స్ అయ్యాడట.

తాజా సమాచారం ప్రకారం.. మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో క్రిష్ సినిమా ఉండచ్చు అని టాక్ వినిపిస్తుంది. బ్రో మూవీ తర్వాత తేజ్ ఆరు నెలలు గ్యాప్ తీసుకోవాలి అనుకున్నారు కానీ.. క్రిష్ కోసం గ్యాప్ ని పక్కనపెట్టి సినిమా చేయడానికి ఓకే అంటాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular