‘థ్యాంక్యూ’ మూవీ ఫ్లాప్ కావడంతో  క‌థల విష‌యంలో నాగ చైత‌న్య మ‌రింత కేర్ తీసుకుంటున్నారు. చాలా క‌థ‌లు విని ఆఖ‌రికి కోలీవుడ్ డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భుతో సినిమాకి ఓకే చెప్పారు. ఇందులో కృతిశెట్టి హీరోయిన్ గా న‌టిస్తోంది. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే.. ఈ మూవీకి వెరైటీ టైటిల్ ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే… వినూత్న‌మైన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ స్టోరీతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో చైత‌న్య పోలీసాఫీస‌ర్ గా న‌టిస్తున్నారు. ఈ క్యారెక్ట‌ర్ కి త‌గ్గ‌ట్టుగానే ఈ మూవీకి వెరైటీగా ‘302’ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతానికి ఈ చిత్రానికి వ‌ర్కింగ్ టైటిల్ గా 302 పెట్టారు. ఈ టైటిల్ నే ఖ‌రారు చేయ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఇందులో త‌మిళ హీరో జీవా, ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఈ సినిమాతో  కచ్చితంగా స‌క్సెస్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు నాగ‌చైత‌న్య‌. అలాగే డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. తొలి ప్ర‌య‌త్నంలోనే టాలీవుడ్ లో బిగ్ స‌క్సెస్ సాధించాలి అనుకుంటున్నాడు. ఈ సినిమాకి తండ్రీకొడుకులు ఇళ‌య‌రాజా, యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తుండ‌డం విశేషం. మ‌రి.. నాగ‌చైత‌న్య ఈ మూవీతో మెప్పించి మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌స్తాడేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *