Thursday, March 28, 2024
Homeసినిమా‘భీమ్లానాయ‌క్’ రిలీజ్ పై మ‌రోసారి క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్

‘భీమ్లానాయ‌క్’ రిలీజ్ పై మ‌రోసారి క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్

January 12th – blast:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ద‌గ్గుబాటిల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ భీమ్లా నాయ‌క్. మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ చిత్రానికి రీమేక్ ఇది. యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాష‌ణ‌లు అందించారు. సితార ఎంట‌ర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. భీమ్లానాయ‌క్ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌నున్న‌ట్టుగా గ‌త కొన్ని రోజుల క్రిత‌మే అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌డం జ‌రిగింది. అయిన‌ప్ప‌టికీ.. ఆర్ఆర్ఆర్ వ‌స్తుండ‌డంతో భీమ్లానాయ‌క్ విడుద‌ల వాయిదా ప‌డ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇలా భీమ్లానాయ‌క్ వాయిదా అంటూ వార్త‌లు వ‌చ్చిన ప్ర‌తిసారీ నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ జ‌న‌వ‌రి 12న భీమ్లా నాయ‌క్ రావ‌డం ప‌క్కా అంటూ ప్ర‌క‌టిస్తూనే ఉన్నారు.

తాజాగా ఈరోజు మ‌రోసారి భీమ్లానాయ‌క్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. భీమ్లానాయ‌క్ వీడియో ర‌ష్ చూశాను. గుర్తుపెట్టుకోండి.. జ‌న‌వ‌రి 12న థియేట‌ర్లో బ్లాస్ట్ అంటూ మ‌రోసారి భీమ్లానాయ‌క్ చెప్పిన డేట్ కి రావ‌డం క‌న్ ఫ‌ర్మ్ అని నిర్మాత‌ చెప్పారు. మ‌రి.. భీమ్లానాయ‌క్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి .

Also Read : భీమ్లా నాయ‌క్ నుంచి మ‌రో పాట విడుద‌ల‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్