Friday, March 29, 2024
HomeTrending Newsరాష్ట్రంలోమూడురోజులు వర్ష సూచన

రాష్ట్రంలోమూడురోజులు వర్ష సూచన

రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల  నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఐఎండి ప్రకారం ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదగా  కొంకణ్  తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో  ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో రాబోవు మూడు రోజులపాటు  రాష్ట్రంలో  విస్తారంగా వర్షాలతో పాటుగా పిడుగులు, భారీవర్షాలు పడతాయని…  పిడుగుపాటు నేపధ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

రేపు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని, ఎల్లుండి శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో  అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం  ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.  అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటనలో పేర్కొంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్