Wednesday, April 17, 2024
Homeసినిమామే 23న 'అంటే.. సుందరానికీ' థర్డ్ సింగిల్

మే 23న ‘అంటే.. సుందరానికీ’ థర్డ్ సింగిల్

Third Single: నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి‘ చిత్రం స్పెషల్ ప్రమోషనల్ కంటెంట్‌తో సందడి చేస్తోంది. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని ఫస్ట్ సింగల్ పంచెకట్టు, సెకెండ్ సింగల్ ఎంత చిత్రం పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ చిత్రం నుండి మూడవ సింగిల్ ‘రాంగో రంగ’ పాట లిరికల్ వీడియోని మే 23న చిత్ర యూనిట్ విడుదల చేయనుంది.

ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాని నుదురు పై బ్యాండైయిడ్ తో తన సైకిల్ ని ఎత్తిపట్టుని అయోమయంగా చూడటం ఆసక్తికరంగా, అదే సమయంలో సుందరం పాత్రలోని కామిక్ టచ్ ని చూపిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ కు భారీ స్పందన వచ్చింది. సందరం పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి అలరించారు నాని. ఈ చిత్రంలో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో నటిస్తుండగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా కనిపించనున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ పని చేస్తున్నారు. ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి ‘అడాడే సుందరా’ అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి ‘ఆహా సుందరా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read :‘అంటే .. సుందరానికి’ అదిరిపోతుంది: నాని ప్రామిస్

RELATED ARTICLES

Most Popular

న్యూస్