Monday, August 10, 2026
Homeసినిమాసంక్రాంతి ‘అనుభ‌వించు రాజా’ నుంచే మొదలవుతుంది : శ్రీను గవిరెడ్డి

సంక్రాంతి ‘అనుభ‌వించు రాజా’ నుంచే మొదలవుతుంది : శ్రీను గవిరెడ్డి

Sankranthi Begins:
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ‘అనుభవించు రాజా’. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోన్నాయి. ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా డైరెక్టర్ శ్రీను గవిరెడ్డితో చెప్పిన చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే…

పూరి జగన్నాథ్ స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. 2016లోనే ఓ రెండు సినిమాలు తెరకెక్కించాను కానీ.. అవి అంతగా ఆడలేదు. ఆ తరువాత మళ్లీ ఓ కథ రాసుకున్నాను. అలా అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్లాను. సినిమా మొదలైంది. క్రాక్ సినిమాకు రైటర్‌గా పని చేశాను. బాలకృష్ణ గారితో చేయబోతోన్న సినిమాలోనూ రైటర్‌గా పని చేస్తున్నాను. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే.. ప్రతీ మనషిలోనూ ఓ ‘అనుభవించు రాజా’ ఉంటాడు. డబ్బు, అమ్మాయిలు, సినిమా ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్లో ఇష్టం ఉంటుంది. లైఫ్ చాలా చిన్నది.. ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలనేది ఈ స్టోరీ. నిజంగా అనుభవించడం ఏంటి? అనేది చెప్పే ఎమోషనే ఈ సినిమా.

Trailer Of Anubhavinchu Raja

అన్నపూర్ణ స్టూడియో‌లోకి ఎంట్రీ అవ్వడానికి ఎంతో కష్టపడతాం. కానీ ఇప్పుడు అన్నపూర్ణ బ్యానర్‌లోనే దర్శకుడిగా సినిమా చేస్తున్నాను. కథ, విలేజ్ సెటప్, ఎండింగ్‌లోని ఎమోషన్ చెప్పాను. అది బాగా నచ్చింది. సుప్రియ ఓకే అన్నారు. చైతన్య, నాగార్జున కూడా విన్నారు. వాళ్లకి కూడా నచ్చడంతో సినిమా మొదలైంది. గోపి సుందర్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నా మొదటి సినిమా కూడా ఆయనే సంగీత దర్శకుడు. నా కోసం ఈ సినిమా చేశారు. ఎంతిస్తే అంత తీసుకున్నారు.

సెక్యూరిటీ గార్డ్ నేపథ్యంలో కథ చెప్పడంతో రాజ్ తరుణ్‌కి కూడా నచ్చింది. ఇంత వరకు చెప్పని బ్యాక్ గ్రౌండ్. ఒరిజినల్‌గా సెక్యూరిటీ క్యాంప్‌కు వెళ్లి అక్కడే షూటింగ్ చేశాం. భీమవరంలో ఓ నలభై రోజులు షూటింగ్ చేశాం. కర్లీ హెయిర్ అనే ట్రాక్ ఉంటుంది. అందుకే కశిష్ ఖాన్‌ను తీసుకున్నాం. ఇండస్ట్రీ చాలా నేర్పించింది. సినిమాలు చాలా నేర్పించాయి. నా బలం ఎంటర్టైన్మెంట్. నేను ఎంతలా పని చేశానో.. సుప్రియ కూడా అంతే పని చేశారు. సిస్టర్, గురువులా నాకు ఎన్నో సలహాలు ఇచ్చారు. నవంబర్ 26 నుంచే సంక్రాంతి మొదలవుతుంది. ఖ‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంది అనేది నా న‌మ్మ‌కం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular