Friday, March 6, 2026
Homeసినిమాఓటీటీలో ఈ వారం తెలుగు సినిమాలివే! 

ఓటీటీలో ఈ వారం తెలుగు సినిమాలివే! 

ప్రతివారం ఓటీటీ ట్రాక్ పైకి కొత్త సినిమాలు వచ్చి చేరుతూనే ఉంటాయి. కంటెంట్ బాగున్న సినిమాలకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక తెలుగు సినిమాలకు .. తెలుగు వెర్షన్ లో వచ్చిన సినిమాలకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. అలా ఈ వారం ‘ఆహా’ ఫ్లాట్ ఫామ్ పైకి రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’ .. అల్లు శిరీష్ ‘బడ్డీ’ సినిమాలు వచ్చాయి. ఈ రెండు కూడా డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకులను పలకరించినవే.

ఈ నెల 31వ తేదీ నుంచి ఆహాలో ‘సారంగదరియా’ స్ట్రీమింగ్ కానుంది. పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రాజా రవీంద్ర .. శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధానమైన పాత్రలను పోషించారు. కుటుంబం అనేది నమ్మకంపై నడుస్తుంది. ఒకరికి ఒకరు సహకరించుకుంటూ తమ కుటుంబ పరువు ప్రతిష్ఠలకు భంగం కలగకుండా చూసుకోవాలి. అలా కాకుండా ఎవరి దారిన వారు ప్రవర్తిస్తే, ఆ యజమాని పరిస్థితి ఎలా ఉంటుందనేది కథ.

ఇక ‘ఈటీవీ విన్’లోకి ‘దీపావళి’ .. ‘షేడ్స్ ఆఫ్ బేబీ పింక్’ సినిమాలు అడుగుపెట్టాయి. ‘దీపావళి’ సినిమా గ్రామీణ జీవన విధానానికి అద్దం పడుతుంది. ఆశలకీ .. అవసరాలకి మధ్యలో నలిగిపోయే శీనయ్య కుటుంబాన్ని ప్రధానముగా చేసుకుని ఈ కథ నడుస్తుంది. ‘షేడ్స్ ఆఫ్ బేబీ పింక్’ సినిమా ఒక పిల్లాడి చుట్టూ తిరుగుతుంది. ఫారిన్లో పేరెంట్స్ .. గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగే పిల్లాడు .. ఒంటరితనంతో అతను పొందే ఎమోషన్స్ ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. ఆలోచింపజేసే కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాలు, ఏ స్థాయిలో కనెక్ట్ అవుతాయనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular