కరోనా తర్వాత అమర్నాథ్ యాత్ర ఇప్పుడు ఇప్పుడే భక్తుల కోలాహలంతో సందడిగా మారుతోంది. ఈ తరుణంలో నిఘా వర్గాలకు కీలక సమాచారం అందింది. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు ఉగ్రదాడుల ప్రమాదం పొంచి ఉన్నది. ఉగ్రవాదులు వాహనంలో అమర్చిన మందుపాతరలతో తీర్థయాత్రను లక్ష్యంగా చేసుకోవచ్చని భద్రతా ఏజెన్సీలకు సమాచారం అందింది. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఇలా దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
Amarnath Yatra: అమరనాథ్ యాత్రకు ఉగ్రదాడి ముప్పు
శనివారం భద్రతా ఏజెన్సీలు దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాకు చేరుకున్నాయి. మందుపాతరలు, బాంబులు, గ్రెనేడ్లతో దాడులు జరిగే పరిస్థితి ఉంటే ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై చర్చించారు. త్వరలోనే జీ20 సమావేశాలు కూడా ఉన్న నేపథ్యంలో ముష్కర మూకలు దేశ ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా విద్రోహ చర్యలకు పాల్పడే ముప్పు ఉందని, దీంతో భద్రత బలగాల్ని అప్రమత్తం చేసినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి.