Sunday, February 23, 2025
Homeసినిమా‘తొలి ఏకాదశి’ తొలి లుక్ విడుదల చేసిన యండమూరి

‘తొలి ఏకాదశి’ తొలి లుక్ విడుదల చేసిన యండమూరి

Tholi Ekadashi : భీమవరం టాకీస్ అండ్ సంధ్య స్టూడియస్ సంయుక్తంగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ సమర్పణలో “సాయి సందీప్ మద్దూరు”ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నూతన నిర్మాత ఎన్ ఫ్రేమ్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై గిరిధర్ శ్రీరామగిరి నిర్మిస్తున్న చిత్రం ‘తొలి ఏకాదశి’. ఇదొక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్. అనుకోకుండా ఒక అమ్మాయి తనకి తెలీకుండానే ఒక సమస్యలో చిక్కుకుంటుంది. ఆ సమస్య నుండి తను ఎలా బయటపడింది అనే కథే ‘తొలి ఏకాదశి’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ప్రఖ్యాత రచయిత-దర్శకులు యండమూరి వీరేంద్రనాథ్ విడుదల చేసి… చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.

సుమిత్ రాయ్, సాయి రాజ్, సాయి నివాస్, మమతా నారాయణ్, వాణి, సాహితి దాసరి, లక్ష్మి కుమార్, శ్రీ నాగమణి, జబర్దస్త్ అప్పారావు, కొత్త వెంకటేశ్వరరావు, సూర్య కిరణ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: బాలరాజు భూక్యా, ఛాయాగ్రహణం: సుధాకర్ అక్కినపల్లి, సంగీతం: సంధ్య వర్షిణి, నిర్మాత: గిరిధర్ శ్రీరామగిరి, రచన-దర్శకత్వం: సాయి సందీప్ మద్దూరు.

Also Read : హ‌ను-మాన్‌ నుంచి అమృత అయ్యర్ ఫస్ట్ లుక్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్