Thursday, March 19, 2026
Homeసినిమాముగ్గురు స్టార్ డైరెక్టర్లను లైన్లో పెట్టిన బన్నీ!

ముగ్గురు స్టార్ డైరెక్టర్లను లైన్లో పెట్టిన బన్నీ!

అల్లు అర్జున్ తాజా చిత్రంగా ‘పుష్ప 2’ షూటింగు జరుపుకుంటోంది. సుకుమార్ దర్శకత్వంలో .. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 400 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థాయ్ ల్యాండ్ అడవుల్లో చిత్రీకరించే సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా కనిపించనున్నాయి. ఈ సినిమా తరువాత ఎవరి దర్శకత్వంలో బన్నీ ప్రాజెక్టు ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.

ఈ నేపథ్యంలో బన్నీ ముగ్గురు స్టార్ డైరెక్టర్లను లైన్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆ జాబితాలో బోయపాటి .. త్రివిక్రమ్ .. సురేందర్ రెడ్డి కనిపిస్తున్నారు. బోయపాటి దగ్గర గీతా ఆర్ట్స్ వారి అడ్వాన్స్ ఉంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సరైనోడు’ భారీ విషయాన్ని సాధించింది. ఇక త్రివిక్రమ్ తో బన్నీ ఆల్రెడీ ఒక హ్యాట్రిక్ హిట్ ను నమోదు చేసి ఉన్నాడు. ‘జులాయి’ .. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ .. ‘అల వైకుంఠపురములో’ ఒకదానికి మించిన సక్సెస్ మరొకటి సాధించాయి.

బన్నీతో సినిమా చేయడానికి సురేందర్ రెడ్డి కూడా రెడీగానే ఉన్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రేసుగుర్రం’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ ముగ్గురూ కూడా బన్నీకి భారీ విజయాలను కట్టబెట్టినవారే. ప్రస్తుతం ఎవరి ప్రాజెక్టుతో వారు బిజీగానే ఉన్నారు. బన్నీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే చాలు, పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ‘పుష్ప 2’ షూటింగు పూర్తికాగానే, ఈ ముగ్గురు దర్శకులలో బన్నీ ఎవరితో కలిసి ముందుగా సెట్స్ పైకి వెళతాడనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular