Thursday, June 18, 2026
Homeసినిమాగోపీచంద్ కి హ్యాట్రిక్ హిట్ పడేనా?!

గోపీచంద్ కి హ్యాట్రిక్ హిట్ పడేనా?!

గోపీచంద్ కి మాస్ యాక్షన్ హీరోగా మంచి క్రేజ్ ఉంది. తన బాడీ లాంగ్వేజ్ కి తగినే పాత్రలనే ఆయన ఎంచుకుంటూ వెళుతున్నాడు. మిగతా హీరోల నుంచి గట్టిపోటీ ఉన్నప్పటికీ, తనదైన మార్కును చూపించే పాత్రలలో కనిపించడానికి ఆయన  ఎక్కువ శ్రద్ధను చూపుతున్నాడు. అయితే కొంతకాలంగా సక్సెస్ అనేది ఆయనతో దోబూచులాడుతూ వస్తోంది. ‘జిల్’ తరువాత ఆయన  వరుస సినిమాలు చేసినప్పటికీ, ఆశించినస్థాయిలో అవి ఆడలేదు.

క్రితం ఏడాది గోపీచంద్ నుంచి ‘పక్కా కమర్షియల్’ సినిమా వచ్చింది. అటు యూవీ .. ఇటు గీతా ఆర్ట్స్ 2వారు ఈ సినిమాను నిర్మించడంతో, ఈ సినిమా మంచి అంచనాల మధ్యలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఫలితం విషయంలో నిరాశపరిచింది. ఇక ఇప్పుడు ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘రామబాణం’ రెడీ అవుతోంది. డింపుల్ హయతి కథానాయికగా నటించిన ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకత్వం వహించాడు.

మాస్ యాక్షన్ సినిమాలను స్టైలీష్ గా తెరకెక్కించడం శ్రీవాస్ ప్రత్యేకత. గతంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలే  అందుకు నిదర్శనం. గోపీచంద్ హీరోగా ఇంతకుముందు ఆయన తెరకెక్కించిన ‘లక్ష్యం’ .. ‘లౌక్యం’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేశాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన మూడో సినిమానే ‘రామబాణం’. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను మే 7వ తేదీన విడుదల చేస్తున్నారు. వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గోపీచంద్ కి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి. ఇక ఈ కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ పడుతుందేమో వెయిట్ చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular