Thursday, June 18, 2026
HomeTrending Newsబాబు ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ అఫ్ కరువు: అంబటి

బాబు ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ అఫ్ కరువు: అంబటి

పోలవరం ప్రాజెక్టు కోసం కలగన్నది, శ్రీకారం చుట్టింది  దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఈ ప్రాజెక్టు ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే పూర్తవుతుందని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పోలవరం ద్రోహి చద్రబాబు అని అభివర్ణించారు. అంబటి నేడు పోలవరం ప్రాజెక్టును  సందర్శించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ను కేంద్ర నిపుణుల బృందం పరిశీలింఛి ఓ నివేదిక ఇచ్చిందని, గుంతలు పూడ్చేందుకు 40 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని పేర్కొన్నారు. డయా ఫ్రమ్  వాల్  లో దెబ్బతిన్న భాగాలు రిపేర్ చేయడానికి 2 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశామని వివరించారు.

లోయర్ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండానే డయా ఫ్రమ్ వాల్ నిర్మించారని, వరదలు వచ్చినప్పుడు ఈ వాల్ దెబ్బతిందని, భారీ నాస్తం వాటిల్లిందని…ఇది తెలుగుదేశం ప్రభుత్వం అనాలోచిత, అసమర్ధ చర్యల వల్లే  జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే భజనలు చేయించుకున్నారని అంబటి ఎద్దేవా చేశారు. ప్రాజెక్టును హడావుడిగా పూర్తి చేసి ఎన్నికల్లోగా రిబ్బన్ కట్ చేయాలనే చంద్రబాబు ఆరాటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు.  ప్రాజెక్టు పూర్తి చేసి,వీలైనంత త్వరగా ప్రజలకు నీరు అందించాలనే చిత్తశుద్దితో తమ ప్రభుత్వం ఉందన్నారు.

పోలవరంపై శ్రద్ధ పెట్టకుండా పట్టిసీమ ఎత్తిపోతల నిర్మించారని, కానీ జగన్ సిఎం అయిన తరువాత నీరు లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని, కృష్ణా నదిలో ఓవర్ ఫ్లో అయి సముద్రంలో కలుస్తున్నాయని అంబటి వివరించారు. అందుకే చంద్రబాబును బెస్ట్ ఫ్రెండ్ అఫ్ కరువు అంటారని వ్యంగ్యాస్త్రం సంధించారు.బాబు అధికారంలోకి వస్తే కరువు మండలాలు ఉంటాయని, జగన్ పాలనలో ఇంతవరకూ ఒక్క కరువు మండలం కూడా లేదని, ఇది సెంటిమెంట్ అంటూ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular