Sunday, January 19, 2025
HomeTrending Newsబెంగళూరులో పేలుడు ముగ్గురు మృతి

బెంగళూరులో పేలుడు ముగ్గురు మృతి

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ రోజు జరిగిన పేలుడులో ముగ్గురు చనిపోయారు. మరో నలుగు తీవ్రంగా గాయపడ్డారు. రాజధానిలోని న్యూ తరగుపేట్ ప్రాంతంలోని బాణసంచ గోడౌన్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిలువ ఉంచిన రసాయనాలతో పేలుడు సంభవించిందని బెంగళూరు దక్షిణ జోన్ డిసిపి హరీష్ పాండే వెల్లడించారు. పేలుడుకు బాణాసంచ, సిలిండర్ కారణం కానేకాదని పోలీసులు స్పష్టం చేశారు. గోడౌన్లో మొత్తం 60 బాక్సుల్లో రసాయనాలు ఉన్నాయని, వాటిలో వాహనంలో ఉన్న మూడు బాక్సులతో ఈ పేలుడు సంభవించిందని వివరించారు.

రసాయనాలు ఎందుకు కోసం నిల్వచేశారు, ఎక్కడికి పంపిస్తున్నారు అనే కోణంలో విచారణ చేపట్టామని పోలీసులు చెప్పారు. గోదాం యజమాని ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉందన్నారు. పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల వరకు వినిపించిందని, భూకంపం వచ్చిందేమోనని ఇళ్ళలో నుంచి బయటకు పరుగులు తీసినట్టు స్థానికులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్