Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ప్ర‌భాస్ వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆదిపురుష్ సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఆ త‌ర్వాత వ‌చ్చే సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 28న ‘స‌లార్’ రిలీజ్ కానుంది. 2024లో ‘ప్రాజెక్ట్ కే’ రిలీజ్ కానుంది. వీటితో పాటు అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ సందీప రెడ్డి వంగ డైరెక్ష‌న్ లో ‘స్పిరిట్’ మూవీ, మారుతి డైరెక్ష‌న్ లో ఓ మూవీ చేయ‌డానికి ఓకే చెప్పారు. ఈ సినిమాలు పూర్త‌వ్వ‌డానికే 2024 అవుతుంది. అయితే.. ఇప్పుడు ప్ర‌భాస్ తో సినిమా చేసేందుకు ముగ్గురు పాన్ ఇండియా డైరెక్ట‌ర్స్ వెయిట్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇంత‌కీ ఆ ముగ్గురు పాన్ ఇండియా డైరెక్ట‌ర్స్ ఎవ‌రంటే.. ముందుగా చెప్పుకోవాల్సింది డైరెక్ట‌ర్ శంక‌ర్ గురించి. ప్ర‌భాస్ తో శంక‌ర్ ఓ భారీ చిత్రం చేయాలనుకుంటున్నార‌ట‌. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ తో సినిమా చేస్తున్నారు. అలాగే క‌మ‌ల్ తో ఇండియ‌న్ 2 చేస్తున్నారు. ఆ త‌ర్వాత ర‌ణ్ వీర్ సింగ్ తో సినిమా…. దీని త‌ర్వాత ప్ర‌భాస్ తో మూవీ అనుకుంటున్నార‌ట శంక‌ర్. అలాగే ఏఆర్ మురుగుదాస్ కూడా ప్ర‌భాస్ తో సినిమా చేయాలని భావిస్తున్నార‌ట‌.

ఇప్పుడు ఈ జాబితాలోకి గౌతమ్ వాసుదేవ మీనన్ పేరు కూడా చేరింది. గౌతమ్ మీనన్ ఇటీవలి కాలంలో దర్శకుడిగా ఆశించిన విధంగా టేకాఫ్ కావడం లేదు కానీ అతడి క్లాసిక్ నేరేషన్ కి వీరాభిమానులున్నారు. లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్లకు అతడు స్పెషలిస్ట్. గౌత‌మ్ మీన‌న్ ప్రభాస్ తో వ‌ర్క్ చేయాలనుందని ఇటీవ‌ల మీడియాకి చెప్పారు. అయితే.. ఆ ముగ్గురితో పని చేసేందుకు ప్రభాస్ ఆసక్తిగా ఉన్నాడా? అంటే.. ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఒక‌వేళ ప్ర‌భాస్ చేయాలి అనుకున్న‌ప్ప‌టికీ సెట్స్ పైకి రావ‌డానికి చాలా టైమ్ ప‌ట్ట‌చ్చు. మ‌రి.. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు సెట్ అవుతాయో చూడాలి.

Also Read :  ఆదిపురుష్ యువి క్రియేష‌న్స్ కి లాభాలు అందిస్తుందా..? 

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com