Thursday, July 9, 2026
Homeసినిమా‘టిల్లు స్క్వేర్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

‘టిల్లు స్క్వేర్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

డీజే టిల్లు సినిమాతో, అందులోని పాత్రతో యువతకు బాగా దగ్గరైన సిద్ధు, స్టార్ బాయ్‌గా ఎదిగాడు. అతను ఆ పాత్రను రూపొందించి, అందులో జీవించిన తీరుకి అతను టిల్లుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం కల్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. టిల్లు అన్నగా ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన సిద్ధు, ఇప్పుడు మరొక థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్ ‘టిల్లు స్క్వేర్‌’తో వస్తున్నాడు. మరోసారి సిద్దు జొన్నలగడ్డను టిల్లుగా చూడబోతున్నాం. ఈసారి వినోదం మొదటి దానికి రెట్టింపు ఉంటుందని చిత్ర నిర్మాతలు ఇప్పటికే హామీ ఇచ్చారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమా పతకాల పై సూర్యదేవర నాగ వంశీ తమ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ డీజే టిల్లుకు సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. డీజే టిల్లు చిత్రంలోని సంగీతం అత్యంత ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా, రామ్ మిరియాల స్వరపరిచి, పాడిన “టిల్లు అన్న డీజే పెడితే” పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి, అది టిల్లు పాత్రకు గుర్తింపుగా మారింది. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ కోసం కూడా రామ్ మిరియాల, సరికొత్త పాటను స్వరపరచి ఆలపించారు.

మాస్ బీట్స్ తో కాలు కదిపేలా హుషారుగా సాగిన ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటోంది. “టిల్లు అన్న డీజే పెడితే” పాట లాగానే, “టికెట్ ఏ కొనకుండా” పాట కూడా పార్టీలు, పబ్‌ల అనే తేడా లేకుండా ప్రతి చోటా ప్లే అయ్యేలా, యువత అమితంగా ఇష్టపడేలా ఉంది. పబ్‌లో మరొక అమ్మాయిని కలిసి, ప్రేమించి మళ్ళీ అవే తప్పులు పునరావృతం చేయకుండా టిల్లును హెచ్చరిస్తున్నట్లుగా సాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular