Friday, March 28, 2025
HomeTrending NewsTina Ambani: ఈడీ విచారణకు హాజరైన టీనా అంబాని

Tina Ambani: ఈడీ విచారణకు హాజరైన టీనా అంబాని

వ్యాపార‌వేత్త అనిల్ అంబానీ భార్య‌ టీనా అంబానీ ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఫెమా ఉల్లంఘ‌న కేసులో ఆమె ఈడీ ముందు హాజ‌రుకావాల్సి వ‌చ్చింది. ఇదే కేసులో సోమ‌వారం అనిల్ అంబానీ కూడా ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన విష‌యం తెలిసిందే. ముంబైలోని బ‌ల్లార్డ్ ఎస్టేట్ ఏరియాలో ఉన్న ఈడీ ఆఫీసుకు వెళ్లారు. దాదాపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ విచారణ సాగడం గమనార్హం.

విదేశీ మారకపు చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై ఆయనను ప్రశ్నించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్టూ వారు పేర్కొన్నారు. అనిల్‌పై ఫెమా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు చెప్తున్నారు. కాగా, అనిల్‌ అంబానీతోపాటు ఆయన భార్య టినా అంబానీ ఈ వారంలో మరోమారు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఈడీ సమన్లు జారీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్