Sunday, January 19, 2025
HomeTrending Newsపిడుగుపాటు నుంచి రక్షణకు సూచనలు

పిడుగుపాటు నుంచి రక్షణకు సూచనలు

అమెరికాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. రాజధాని వాషింగ్టన్ డిసి లో శ్వేత సౌధానికి సమీపంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ హటాత్ పరిణామానికి చుట్టూ పక్కల ప్రజలు భయబ్రాంతులకు గురి అయ్యారు.
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామంలో సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. రైతు కూలీలు పొలాల్లోని గట్లపై ఉన్న సమయంలో భారీ పిడుగుపడి అక్కడికక్కడే ముగ్గురూ మృతిచెందారు. అలాగే పల్నాడు జిల్లా శావల్యాపురం మండలంలోని మతుకుమల్లిలో మరొకరు మృతి చెందారు.
ప్రతి ఏడాది భారత దేశంలో కూడా పెద్ద సంఖ్యలో పిడుగుపాటుకు బలి అవుతున్నారు. 2020 జూన్ లో ఉత్తరప్రదేశ్, బీహార్,ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కేవలం 48 గంటల్లోనే సుమారు 120 మంది చనిపోయారు. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినపుడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడితే ఆ సమయంలో పిడుగుపాటుకు అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జూన్ నుంచి మూడు నెలల పాటు పిడుగులు పొంచి ఉన్న కాలమని ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వాతావరణ శాఖ అధికారులు ఈ విధంగా సూచిస్తున్నారు.
* 50 మైక్రో సెకన్లలో ప్రభావం చూపే పిడుగు
* ప్రంపచవ్యాప్తంగా సెకనుకు 100 పిడుగులు
* పిడుగు నుంచి విద్యుత్‌ను నిల్వ చేయగలిగితే ఒక పిడుగు నుంచి 10 కోట్ల వాట్ల విద్యుత్ పొందవచ్చు
* ఇల్లు, కార్, బస్, ట్రైన్‌లో ఉన్నప్పుడు పిడుగుపాుట నుంచి రక్షణ ఉంటుంది
* పిడుగుల శబ్దం వినిపిస్తూ, వర్షం పడుతుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కిందికి పోకూడదు
* పిడుగు ఎత్తైన చెట్లను వాహకంగా చేసుకుంటుంది ( తాటి, కొబ్బరి చెట్లు )
* ఎత్తైన చెట్లు లేని చోట్ల ఇతర చెట్లను వాహకంగా చేసుకుంటుంది
* చెట్టు మీద పిడుగు పడ్డప్పుడు చెట్టు చుట్టూ తడి నేలపై 50 మీటర్ల వరకు కరెంట్ ప్రసరిస్తుంది
* వాన పడేటప్పుడు చెట్టు కిందకు వెళ్లకూడదని గ్రామీణ ప్రాంతాల్లోని పశువుల కాపర్లకు అవగాహన కల్పించాలి
* గొర్రెలు, పశువులను కూడా చెట్ల కిందికి వెళ్లనీయొద్దు
* తడిసిన పూరి గుడిసెల పైన, గడ్డివాములపైన కూడ పిడుగు పడుతుంది
* చుట్టూ 500 మీటర్ల వరకు చెట్లు లేనప్పుడు, చెలకల వద్ద నల్లని దట్టమైన మేఘాలు ( భూమి నుంచి 2 కి.మీ ఎత్తు లోపలంటే క్యుములో నింబస్ మేఘాలు ) వర్షించినప్పుడు నడుస్తున్నా, నిటారుగా నిల్చున్నా పిడుగు మనల్నే వాహకంగా చేసుకుంటుంది. తడిస్తే తడిచామని కింద పాదాలపై భూమిని తక్కువ తాకేలా కూర్చోవాలి
దట్టమైన మేఘాలు కమ్ముకుని వానతో పాటు పిడుగులు పడుతున్నప్పుడు ఇలా కూర్చోవాలి. పాదాలు మాత్రమే నేలకు తాకేలా, ఒకరికొకరు 100 అడుగుల దూరాన్ని పాటించాలి. చెట్లు లేని పెద్ద మైదానం, పంటలు కోసిన చేలల్లో ఉన్నప్పుడు ఇలా చేస్తే పిడుగుపాటు నుంచి తప్పించుకోవచ్చు. తడిస్తే తడవచ్చు కాని ప్రాణాలు దక్కించుకోగలుగుతాం. దగ్గర గడ్డపార లాంటి లోహపు వస్తువులు లేకుండా చూసుకోవాలి. పిడుగుల శబ్ధాలకు భయపడేవారు చెవులు మూసుకుంటే ఆందోళన తగ్గుతుంది
RELATED ARTICLES

Most Popular

న్యూస్