Saturday, November 23, 2024
HomeTrending Newsవర్షాలకు తిరుమల తిరుపతి అస్తవ్యస్తం

వర్షాలకు తిరుమల తిరుపతి అస్తవ్యస్తం

Tirumala Tirupati Drastically Affected By Heavy Floods :

భారీ వర్షాలకు తిరుపతి నగరంతో పాటు తిరుమల కొండపై కూడా పరిస్థితి అస్తవ్యస్తమైంది. తిరుపతిలో రహదారులు, ఇళ్ళపై భారీగా వరద నీరు చేరింది. ప్రజాజీవనం స్తంభించింది, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఈ వరద భీభత్సానికి అతలాకుతలం అవుతున్నారు. తిరుపతి రూరల్ ప్రాంతంలో స్వర్ణముఖి నది పొంగి చిగురువాడ వద్ద వంతెన కొట్టుకుపోయింది.

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. మొదటి ఘాట్ రోడ్డు అక్కగార్ల గుడివద్ద బ్రిడ్జి కొద్దిగా కుంగిపోయింది.  రెండో ఘాట్ రోడ్డులో దాదాపు 20 చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. తిరుమల కొండపై ఉన్న భక్తులు మరో రెండ్రోజులపాటు కొండపైనే ఉండాలని టిటిడి అధికారులు సూచించారు. రెండ్రోజులపాటు ఘాట్ రోడ్డు, అలిపిరి, శ్రీవారి మెట్లు నడకదార్లు మూసి ఉంటాయని ప్రకటించారు. కొండపై ఉన్న భక్తులకు అవసరమైన వసతి, భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు.

భారీ వర్షాలపై సిఎం సమీక్షలో సైతం తిరుమల తిరుపతి పరిస్థితిపై అధికారులకు పలు సూచనలు చేశారు.

తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయంగా ఉండాలని, రైళ్లు, విమానాలు రద్దయిన నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండాలి

ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో వారిని కిందకు రాకుండా పైనే ఉంచాలి

కనీసం ఒకటి, రెండు రోజులు వారికి తగిన వసతులు సమకూర్చాలి

టీటీడీ అధికారులతో సమన్వయం చేసుకుని యాత్రికులకు సహాయంగా నిలవాలి

తిరుపతి కార్పోరేషన్ సహా, ఇతర సిబ్బందిని కూడా వినియోగించి పారిశుధ్యం పనులు చేపట్టాలి

అవసరమైతే ఇతర మున్సిపాల్టీలనుంచి సిబ్బందిని తీసుకు వచ్చి ఆపరేషన్‌ చేపట్టాలి….. అని సిఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Must Read :  తిరుమల: రెండ్రోజులు నడకదారి బంద్

RELATED ARTICLES

Most Popular

న్యూస్