Sunday, November 24, 2024
HomeTrending Newsతిరుపతిలో డైరెక్ట్ టాక్స్ శిక్షణ కేంద్రం: ఎంపి

తిరుపతిలో డైరెక్ట్ టాక్స్ శిక్షణ కేంద్రం: ఎంపి

నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ ప్రాంతీయ శిక్షణా కేంద్రాన్ని (ఎన్ఏడిటి) తిరుపతిలో నెలకొల్పాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ చైర్మన్ నితిన్ గుప్తాకు తిరుపతి ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో నైపుణ్య అభివృద్ధి, పరిశోధనా కేంద్రాలు తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నాయని, ప్రైవేట్ పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయని.. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ఏడిటి ని ఏర్పాటు చేయాలని కోరారు.  రాష్ట్ర రెవెన్యూ అధికారులకు ఎన్నో అంశాల్లో తగిన శిక్షణ కూడా అందించేందుకు ఇది దోహదం చేస్తుందని గుప్తా దృష్టికి తీసుకు వచ్చారు.

నాగ్‌పూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఆధ్వర్యంలో భారతదేశంలో 10 ప్రత్యక్ష పన్నుల ప్రాంతీయ శిక్షణా సంస్థలు ఉన్నాయని… అయితే  తెలుగు రాష్ట్రాల్లో ఈ కేంద్రం లేదని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు తగినంత భూమితో సహా మౌలిక సౌకర్యాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాగా తన ప్రతిపాదన పట్ల గుప్తా సానుకూలంగా స్పందించారని, సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎంపీ గురుమూర్తి తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్