Tuesday, September 17, 2024
Homeసినిమామొన్న ఎన్టీఆర్, నేడు నితిన్

మొన్న ఎన్టీఆర్, నేడు నితిన్

గత ఆదివారం హీరో ఎన్టీఆర్ ను  బిజెపి అగ్రనేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా క‌ల‌వ‌డం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం అయ్యిందో తెలిసిందే. పైకి మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌న‌ను అభినందించ‌డానికే అని చెప్పిన‌ప్ప‌ట‌కీ.. దీని వెనుక రాజ‌కీయ కార‌ణాలు ఉన్నాయ‌ని.. అందుక‌నే అమిత్ షా ఎన్టీఆర్ ను క‌లిసార‌ని అటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఇటు సినీ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ జ‌రిగింది.

అయితే.. ఇప్పుడు బేజీపీ అధ్య‌క్షుడు న‌డ్డా, తెలంగాణ యంగ్ హీరో నితిన్ తో క‌ల‌వ‌డం ఆస‌క్తిగా మారింది. ఎన్నిక‌లు వ‌స్తున్న నేప‌ధ్యంలో బీజేపీ కాస్త ముందుగానే రంగంలోకి దిగింది. టాలీవుడ్ పై పోక‌స్ పెట్టింది. తెలంగాణ‌లో అధికారం ద‌క్కించుకోవ‌డం కోసం సినీతార‌ల‌ను పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయించాలని ప్ర‌య‌త్నిస్తుంది.

నితిన్ తో న‌డ్డా భేటీకి కార‌ణం తెలియ‌లేదు కానీ.. దీని వెనుకు ఏం జ‌రుగుతోంది.? అస‌లు సినీ తార‌ల‌తో బీజేపీ నాయ‌కుల క‌ల‌యిక వెనుక ఎవ‌రున్నారు అనేది ఆస‌క్తిగా మారింది. నితిన్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి వీరాభిమాని. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. న‌డ్డాతో నితిన్ క‌ల‌యిక వెనుక ప‌వ‌న్ ఉన్నారా…?  లేక రాజ‌మౌళి ఫాద‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఉన్నారా..?  అనేది ఆస‌క్తిగా మారింది.

Also Read :  తెలుగు సినిమా తారక రత్నాన్ని కలిశా: అమిత్ షా ట్వీట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్