Wednesday, June 17, 2026
HomeసినిమాVirat Karrna: టాలీవుడ్ కి మరో మాస్ హీరో దొరికేసినట్టే!

Virat Karrna: టాలీవుడ్ కి మరో మాస్ హీరో దొరికేసినట్టే!

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ కి చాలామంది కొత్త హీరోలు పరిచయమయ్యారు. కొత్త హీరో అంటే ఆ కొత్తదనం తెరపై కొంతవరకూ కనిపిస్తూనే ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో బాగా చేసినా, మరొకొన్ని సీన్స్ లో దొరికిపోతూ ఉంటారు. యాక్షన్ .. ఎమోషన్ .. డైలాగ్ డెలివరీ .. పాటల్లో రొమాంటిక్ ఫీల్ ఇవన్నీ ఫస్టు సినిమాలోనే కవర్ చేయడం .. మెప్పించడం కొంచం కష్టమైన విషయమే. టోటల్ గా ఇది ఇతనికి ఫస్టు మూవీ కాదేమో అనిపించుకోవడం కష్టం. ‘పెదకాపు’ సినిమాతో అలాంటి గండాన్ని గట్టెక్కేసిన హీరోగా విరాట్ కర్ణ కనిపిస్తాడు.

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో .. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘పెదకాపు 1’ క్రితం నెల 29వ తేదీన విడుదలైంది. కొత్త హీరో అయినప్పటికీ విడుదలకి ముందే ఈ సినిమాపై బజ్ కనిపించింది. గ్రామీణ నేపథ్యం .. టైటిల్ .. లవ్ ట్రాక్ .. మాస్ యాక్షన్ అంశాలు అందరిలోనూ ఆసక్తిని పెంచుతూ వెళ్లాయి. దాంతో థియేటర్ల దగ్గర జనాలు బాగానే కనిపించారు. ఆ తరువాత మౌత్ టాక్ తో మరింతగా జనాలు పెరగడం కనిపించింది. అందుకు కారణం కంటెంట్ .. శ్రీకాంత్ అడ్డాల టేకింగ్ అని చెప్పచ్చు.

ఈ సినిమాలో ‘పెదకాపు’ పాత్రలో విరాట్ కర్ణ కనిపించాడు. ఆ పాత్రకి ఆయన సరిగ్గా సరిపోయాడు. ఆయన లుక్ .. వాయిస్ ..  డైలాగ్ డెలివరీ .. ఎక్స్ ప్రెషన్స్ .. ఫైట్స్ .. పాటల్లో ఫీల్ ను చూపించడంలో తను సక్సెస్ అయ్యాడు. విరాట్ కర్ణ కళ్లలో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. పాత్రను అర్థం చేసుకుని .. దానిని సహజత్వానికి దగ్గరగా తీసుకుని వెళ్లే ఈజ్ ఉంది. మాస్ పాత్రలను తాను బాగా చేయగలడు అనే విషయాన్ని ఈ సినిమా నిరూపించింది. అలాగే ప్రగతి శ్రీవాత్సవ కూడా చాలా సహజంగా చేసింది. ఈ ఇద్దరికీ మంచి ఫ్యూచర్ ఉందనే విషయం ఈ సినిమా చూసినవారికి  అర్థమైపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular