Saturday, January 18, 2025
Homeసినిమాపవర్ స్టార్ టైటిల్స్ వాడుకుంటున్న యంగ్ హీరోలు

పవర్ స్టార్ టైటిల్స్ వాడుకుంటున్న యంగ్ హీరోలు

పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభంలో నటించిన చిత్రాలు జనాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అప్పుడు టీనేజ్ లో ఉన్న వాళ్లు ఇప్పుడు హీరోలుగా, దర్శకులుగా మంచి పొజిషన్ లో ఉన్నారు. అందుకనే వీరికి పవన్ సినిమాల పై ప్రత్యేక ప్రేమ. తమ సినిమాలకు పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్స్ పెడుతున్నారు. ఆమధ్య మెగా హీరో వరుణ్‌ తేజ్ నటించిన చిత్రానికి పవన్ టైటిల్ తొలిప్రేమ అని పెట్టారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. వరుణ్ తేజ్, వెంకీ అట్లూరి ఇద్దరికీ మంచి విజయాన్ని అందించింది.

తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ తో వస్తున్న మరో సినిమా ‘ఖుషి’. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సాంగ్స్, టీజర్ అండ్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోవడంతో ఖుషి సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందించారు. సెప్టెంబర్ 1న ఖుషి చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఇక ఇప్పుడు యంగ్ హీరో నితిన్ పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ తో సినిమా చేస్తుండడం విశేషం. నితిన్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే. తన సినిమాల్లో ఏమాత్రం అవకాశం కుదిరినా పవన్ కళ్యాణ్ గురించి ఏదోక ప్రస్తావన తీసుకువస్తుంటాడు. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ టైటిల్ తోనే సినిమా చేస్తుండడం విశేషం. ఇంతకీ ఏంటా టైటిల్ అంటారా..? ‘తమ్ముడు’. పవన్ కళ్యాణ్ కు కెరీర్ బిగినింగ్ లో మంచి విజయాన్ని అందించిన సినిమా ఇది. ఇప్పుడు నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు సినిమా రూపొందుతుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇలా ముగ్గురు యువ హీరోలు వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ, నితిన్ పవన్ కళ్యాణ్చిత్రాల టైటిల్స్ తో సినిమాలు చేయడం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్