Friday, November 22, 2024
Homeస్పోర్ట్స్ఉప్పల్ టెస్టులో ఇంగ్లాండ్ దే విజయం

ఉప్పల్ టెస్టులో ఇంగ్లాండ్ దే విజయం

ఇంగ్లాండ్ బౌలర్ టామ్ హార్ట్లీ  ఏడు వికెట్లతో సత్తా చాటి ఇండియా బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీయడంతో తొలి టెస్టులో ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది. ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు ఇండియాలో పర్యటిస్తోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం తొలి టెస్టుకు ఆతిథ్యం ఇచ్చింది.

జనవరి 25 న ఆరంభమైన ఈ టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒక్కడే 70 పరుగులతో రాణించాడు. జడేజా, అశ్విన్ చెరో మూడు; బుమ్రా, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

రవీంద్ర జడేజా-87; కెఎల్ రాహుల్- 86′ యశస్వి జైస్వాల్-80; అక్షర్ పటేల్-44; శ్రీకర్ భారత్-41 పరుగులతో రాణించడంతో ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 436కు ఆలౌట్ అయి 190 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ఓలీ పోప్ 196 పరుగులతో ధాటిగా ఆడడంతో ఆ జట్టు 420 పరుగులు చేసింది. డక్కెట్ 47; ఫోకస్-34; టామ్ హార్ట్లీ-34… కూడా రాణించారు. బుమ్రా-4; అశ్విన్-3; జడేజా-2; అక్షర్ ఒక వికెట్ పడగొట్టారు.

మ్యాచ్ విజయానికి 231 పరుగుల లక్ష్యంతో నేడు నాలుగో రోజు లంచ్ తరువాత బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇండియా 42 పరుగుల వద్ద రెండు వికెట్లు (కెప్టెన్ రోహిత్ -39; శుభ్ మన్ గిల్-డకౌట్) వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత వరుస వికెట్లు సమర్పించుకుంది. శ్రీకర్ భరత్-28; రవిచంద్రన్ అశ్విన్-28; కెఎల్ రాహుల్-22 మినహా మిగిలిన వారు విఫలం కావడంతో 202 పరుగులకే ఇండియా చాపచుట్టేసింది. టామ్-7; జో రూట్, జాక్ లీచ్ చెరో వికెట్ సాధించారు.

ఓలీ పోప్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

రెండో టెస్ట్ మ్యాచ్ ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం స్టేడియంలో ఫిబ్రవరి 2 న మొదలు కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్