Sunday, January 19, 2025
HomeTrending Newsకేరళలో టమాటా ఫ్లూ

కేరళలో టమాటా ఫ్లూ

Tomato Flu : కరోనా మహమ్మారి నుండి పూర్తిగా ఇంకా బయటపడకముందే..కేరళలో టమాటా ఫ్లూ కలకలం రేపుతోంది. ప్రధానంగా ఐదేళ్లలోపు పిల్లలు ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. చిన్నారుల్లో తీవ్రమైన జ్వరం, ఇతర లక్షణాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇప్పటివరకు 80 మందికి పైగా చిన్నారులకు టమాటా ఫ్లూ సోకింది. అత్యంత అరుదైన ఈ వ్యాధి కారణంగా చర్మంపై ఎర్రటి బొబ్బలు రావడం జరుగుతుంది. అవి టమాటా ఆకారంలో ఉండడంతోనే దానికా పేరు పెట్టినట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ ఫ్లూ బారినపడిన వారిలో తీవ్రమైన జ్వరం, నీరసంగా అనిపించడం, ఒళ్లు నొప్పులు, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే, కొందరు చిన్నారుల్లో జలుబు, దగ్గు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, చేతులు, మోకాళ్లు, పిరుదులు రంగు మారుతాయని చెబుతున్నారు.

ఈ కేసులన్నీ ఒక్క కొల్లం జిల్లాలోనే నమోదవడం గమనార్హం. ఈ వ్యాధికి గల కారణాలపై ఇంకా స్పష్టత లేదు. టమాటా ఫ్లూ ఇతర ప్రాంతాలకూ వ్యాపించే ప్రమాదముందని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. టమాటా ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో కేరళ పొరుగు రాష్ట్రం తమిళనాడు అప్రమత్తమైంది. కేరళ నుంచి వచ్చే వారికి సరిహద్దుల్లోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తోంది. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, శరీరంలో నీటిస్థాయి తగ్గకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : రాయగడలో విద్యార్థులకు కరోనా 

RELATED ARTICLES

Most Popular

న్యూస్