Friday, October 18, 2024
HomeTrending NewsTomatoes: బెంగాల్లో కొండెక్కిన టమోటో ధర

Tomatoes: బెంగాల్లో కొండెక్కిన టమోటో ధర

వేసవి కాలం ముగిసి వానా కాలం మొదలయ్యాక కూరగాయల కొరత ఉండటం పరిపాటి. అయితే ఈ ఏడాది మాత్రం  ధరలు  చుక్కలు చూపిస్తున్నాయి. అందులో టమాట  గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టమాట ధర రికార్డు స్థాయికి చేరడంతో సాధారణ ప్రజలు వాటిని కొనాలంటేనే జడుసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కిలో టమాట ధర రూ.58 నుంచి రూ.148 పలుకుతున్నది. పశ్చిమబెంగాల్‌లోని పురులియా ప్రాంతంలో మాత్రం అత్యధికంగా రూ.155కు చేరింది. ఎండల తీవ్రత పెరగడం, ఋతుపవనాల రాక ఆలస్యమవడంతో టమాటా ఉత్పత్తి తగ్గిపోయిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ  వెల్లడించింది.

ముంబైలో అతితక్కువగా కిలో రూ.58 పలుకుతుండగా, హైదరాబాద్ -60, ఢిల్లీలో రూ.110, చెన్నైలో రూ.117, కోల్‌కతాలో రూ.148కి చేరిందని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా రూ.83.29కు లభిస్తున్నదని పేర్కొంది. అయితే ప్రాంతాన్ని, అమ్మకపుదారులను బట్టి రూ.120 నుంచి రూ.140 వరకు ధర పలుకుతున్నదని చెప్పింది. ఢిల్లీలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, బ్లిన్‌కిట్‌ వంట్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ అప్లికేషన్స్‌ కిలో రూ.140 అమ్ముతున్నాయని వెల్లడించింది. ప్రస్తుత సీజన్‌ కారణంగా ధరలు అమాంతం పెరిగిపోయాయని, మరో 15 నుంచి నెల రోజుల్లో అవి దిగివచ్చే అవకాశం ఉందని తెలిపింది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్