Monday, June 15, 2026
Homeసినిమాఆది సాయికుమార్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ‘టాప్ గేర్’ టీమ్

ఆది సాయికుమార్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ‘టాప్ గేర్’ టీమ్

ప్రేమ కావాలి అంటూ కెమెరా ముందుకొచ్చి తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయి కుమార్. 2011లో ఇండస్ట్రీలో అడుగు పెట్టి వైవిధ్య భరితమైన కథలతో అలరిస్తున్నారు. రోల్ ఎలాంటిదైనా సరే అందులో లీనమవుతూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ క్లాస్, మాస్ ఆడియన్స్ మెప్పు పొందుతున్నారు. 2011 సంవత్సరంలో ప్రేమ కావాలి సినిమాకు గాను దక్షిణాది ఫిలిం ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నూతన నటుడిగా పురస్కారం అందుకున్నారు ఆది సాయి కుమార్.

ప్రస్తుతం తెలుగులో టాప్ గేర్ సినిమా చేస్తున్నారు ఆది సాయి కుమార్. కె. శశికాంత్ దర్శకత్వంలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వదిలిన అన్ని అప్‌డేట్స్ విశేష స్పందన తెచ్చుకోవడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. డిసెంబర్ 30న ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. నేడు (డిసెంబర్ 23) ఆది సాయి కుమార్ పుట్టినరోజు కావడంతో ‘టాప్ గేర్’ టీమ్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతోంది. త్వరలో మరిన్ని మంచి సినిమాలతో అలరించేందుకు ఆది సాయి కుమార్ సిద్ధమవుతున్నారు.

Also Read : రవితేజ చేతుల మీదుగా ‘టాప్ గేర్’ ట్రైలర్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular