Sunday, January 19, 2025
Homeసినిమాభారీ సినిమాలతో రంగంలోకి దిగిన బడా హీరోలు! 

భారీ సినిమాలతో రంగంలోకి దిగిన బడా హీరోలు! 

ఇప్పుడు ఎక్కడ చూసినా పాన్ ఇండియా అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఒక రేంజ్ హీరోల మొదలు, అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. కొంతమంది హీరోలు తమ సినిమా పాన్ ఇండియా అని నేరుగా చెప్పకపోయినా, ఆ సినిమాలు ఐదు భాషల్లో విడులవుతున్నాయి. మిగతా భాషల్లో వసూళ్లు ఆ హీరోకి అక్కడ ఉన్న గుర్తింపు .. కంటెంట్ పై వసూళ్లు ఆధారపడుతున్నాయి. పాన్ ఇండియా సినిమా అనగానే స్క్రిప్ట్ దగ్గర నుంచి కసరత్తులు గట్టిగా జరుగుతున్నాయి.

టాలీవుడ్ లో ఒక వైపున ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఆయన నుంచి రానున్న ‘సలార్’ పై అంచనాలు పెరుగుతూ వెళుతున్నాయి. ఇక ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత ఎన్టీఆర్ .. చరణ్ ఇద్దరూ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టుల వైపే మొగ్గు చూపుతున్నారు. చరణ్ నుంచి ‘గేమ్ ఛేంజర్’ .. ఎన్టీఆర్ నుంచి ‘దేవర’ భారీ స్థాయిలో నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఈ రెండు సినిమాలు ముందు నుంచే ఒక హైప్ తెచ్చుకున్నాయి. ఆ సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిటింగులో ఉన్నారు.

ఇక మహేశ్ బాబు మాత్రం ‘గుంటూరు కారం’ సినిమాతో తన కెరియర్లో ఫస్టు పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మహేశ్ ను మాస్ హీరోగా ఒక రేంజ్ లో ఆయన చూపించనున్నాడనే విషయం ఫస్టులుక్ తోనే అర్థమైపోయింది. ఇక ఆ తరువాత నాని ఆల్రెడీ పాన్ ఇండియా బరిలోకి దిగిపోగా, అదే బాటలో అడుగు ముందుకు వేయడానికి రామ్ రెడీ అవుతున్నాడు. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో రామ్ కూడా పాన్ ఇండియాకి పరిచయమవుతున్నాడు. మొత్తానికి స్టార్ హీరోలంతా భారీ ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారన్న మాట.

RELATED ARTICLES

Most Popular

న్యూస్