Monday, April 15, 2024
HomeTrending NewsBJP vs BRS: రాహులే మోదీకి గుత్తేదారు - జగదీశ్ రెడ్డి

BJP vs BRS: రాహులే మోదీకి గుత్తేదారు – జగదీశ్ రెడ్డి

మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ లీడర్‌ కాదని రీడరని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రెండుసార్లు ఏఐసీసీ అధ్యక్ష పదవిని అర్దాంతరంగా వదిలి పెట్టారని విమర్శించారు. రాసిచ్చింది చడవడమే ఆయన చేస్తున్న పనని ఎద్దేవా చేశారు. నిన్నా, మొన్నా గల్లీ లీడర్లు మాట్లాడిన మాటలనే రాహుల్‌ ఉటంకించారని చెప్పారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి బీఆర్‌ఎస్‌ రిశ్తేదార్‌ కాదని, రాహులే మోదీకి గుత్తేదారన్నారు. రూ.4 వేల పింఛన్‌ ఇస్తామని ఏ హోదాలో ప్రకటించారని నిలదీశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇస్తున్న ఫించన్ ఎంత అని ప్రశ్నించారు. పింఛన్ ప్ల కార్డులు రాహులు తెలిసే పట్టుకున్నారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

రూ.4 వేల పెన్షన్‌ ఇచ్చేది నిజమే అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వడం లేదరన్నారు. కాంగ్రెస్ పార్టీని కొనఊపిరితో బతికిస్తున్న ఛత్తీస్‌గఢ్‌లో వృద్ధులకు ఇస్తున్నది రూ.350లేనని చెప్పారు. అదే రాష్ట్రంలో వికలాంగులకు రూ.500, వితంతువులకు రూ.350 ఇస్తున్నారని తెలిపారు. అదే పార్టీ ఎలుబడిలో ఉన్న రాజస్థాన్లోనూ వృద్ధులకు రూ.750, వికలాంగులకు రూ.750, వితంతువులకు రూ.550 మాత్రమేనని వెల్లడించారు. సచ్చిపోతుందనుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిన కర్ణాటకలోనూ ఇచ్చేది అంతకంటే ఎక్కువ లేదన్నారు. అందుకే ఆయనను లీడర్‌గా కాకుండా రీడర్‌గానే చూడాల్సి వస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇవ్వని ఫించన్లు తెలంగాణా లో ఇస్తామని ప్రకటించడానికి సిగ్గుఉండాలన్నారు.

రూ.4 వేల పింఛన్‌ ప్రకటన ఇక్కడి ప్రజలకు నమ్మ శక్యంగా లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్వాంగులకు రూ.4,000, వితంతువులు, వృద్ధులకు రూ.2016 ఇస్తున్నారని గుర్తుచేశారు. కాళేశ్వరం కట్టిందే లక్ష కోట్లతోనని, కట్టిన మొత్తంలో స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు చేయడం రాహుల్ అజ్ఞానాన్ని బయట పడేసిందని చెప్పారు. కాళేశ్వరం కట్టింది నిజమో కాదో తెలియడానికి రాహుల్ మెడిగడ్డ మీద నుండి దూకితే తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్