TOP Leaders Nominations :
సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ రోజు కర్హల్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అఖిలేష్ కుటుంబానికి పట్టున్న ప్రాంతం మైన్ పూరి జిల్లా కర్హాల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ దఫా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోనున్నాయని అఖిలేష్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రగతి కోసం జరిగే ఈ ఎన్నికల్లో ఎస్పి విజయం సాధిస్తుందని అఖిలేష్ ట్వీట్ చేశారు. కర్హల్ నియోజకవర్గంలో మూడో దశలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 20 వ తేదిన పోలింగ్ ఉంది.
మరోవైపు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్ని ఈ రోజు బర్నాల జిల్లాలోని భదోర్ నియోజవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. సిఎం చన్ని ఈ దఫా రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్నారు ఒకటి బదోర్ కాగా మరొకటి చంకోర్ సాహిబ్ నుంచి పోటీ చేస్తున్నారు. అటు శిరోమణి అకాలిదల్ అగ్రనేత ప్రకాష్ సింగ్ బాదల్ కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. బాదల్ లంబి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయటం ద్వారా దేశంలో పెద్ద వయసు నేతగా 94 ఏళ్ళ ప్రకాష్ సింగ్ బాదల్ పేరు గడించారు.
శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుక్బీర్ సింగ్ బాదల్ ఈ రోజు జలాలాబాద్ నియోజవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో ఆయన భార్య, కేంద్ర మాజీ మంత్రి హార్ సిమ్రత్ కౌర్ కూడా పాల్గొన్నారు.
Also Read :ఎన్నికల సిత్రాలు