Saturday, November 23, 2024
Homeఅంతర్జాతీయంకెంటకీలో టోర్నడో భీభత్సం: 100మంది మృతి

కెంటకీలో టోర్నడో భీభత్సం: 100మంది మృతి

Tornado swirling:
అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో టోర్నడో విలయ తాండవం సృష్టించింది. ఈ ప్రకృతి భీభత్సానికి వందమందికి పైగా మరణించారు. అధ్యక్షుడు జో బిడెన్ ఆ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించారు. అమెరికా చరిత్రలోనే ఇది అది పెద్ద టొర్నాడోగా అధికారులు భావిస్తున్నారు. దాదాపు 500  కిలోమీటర్ల మేర పలు ప్రాంతాలపై ఈ టోర్నడో తీవ్రమైన ప్రభావాన్ని చూపిందని కెంటకీ గవర్నర్ బేషియర్ చెప్పారు.

పెను గాలులతో వచ్చిన ఈ తుఫాను ధాటికి ఒక క్యాండిల్ తయారు చేసే పరిశ్రమ పైభాగం కూలిపోయి అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఎక్కువమంది ఈ విపత్తులో మరణించారని, సహాయ చర్యలకోసం 200 మంది సిబ్బందిని రంగంలోకి దించామని బేషియర్ వెల్లడించారు. ఇలాంటి వినాశనం మునుపెన్నడూ తాను చూడలేదని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్తు మాటల్లో వర్ణించలేనిదన్నారు. క్యాండిల్ ఫ్యాక్టరీ నుంచి దాదాపు 40  మందిని సురక్షితంగా కాపాడగలిగామని, ఈ దుర్ఘటన జరిగే సమయంలో దాదాపు 110  మంది వరకూ ఆ కర్మాగారంలో ఉన్నట్లు తెలిసిందన్నారు.

కూలిన భవనాలు, చెట్లు, ధ్వంసమైన వాహనాలతో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు భయానకంగా మారిపోయాయి. ప్రజలు ఈ విలయం నుంచి మానసికంగా ఇంకా బైటికి రాలేకపోతున్నారు. బాంబు పేలిన శబ్ధంతో టొర్నాడో సంభవించిందని, తాము భయాందోళనలకు గురయ్యామని, ఈ పెనుగాలుల ధాటికి తమ షాపు పైకప్పు ఊడిపోయిందని కెంటకీలోని బౌలింగ్ గ్రీ లో ఓ కాఫీ షాపు ఓనర్ జస్టిన్ షెఫర్డ్ వెల్లడించాడు.

Also Read : పెన్సిల్వేనియా వర్సిటీ హెడ్ గా తెలుగు మహిళ

RELATED ARTICLES

Most Popular

న్యూస్