Revanth Reddy Arrest :
ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో కాంగ్రెస్ కిసాన్ సెల్ తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. ఈ రోజు మధ్యాహ్నం రచ్చబండ నిర్వహించాలని ఇదివరకే నిర్ణయించారు. రచ్చబండ ద్వారా కెసిఆర్ ఫాం హౌసులో సాగు చేస్తున్న 150 ఎకరాల వారి సాగును అందరికి చూపెడతానని రేవంత్ ప్రకటించారు. కార్యక్రమానికి తగిన అనుమతులు లేవని పోలీసులు రచ్చబండ నిర్వహణకు అనుమతించలేదు. తెలంగాణ పిసిసి నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేయగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని గృహ నిర్భందం చేశారు. రేవంత్ నివాసం వద్ద కాంగ్రెస్ శ్రేణులు పెద్ద మొత్తంలో చేరగా ఎలానటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కొద్ది సేపటి క్రితం రేవంత్ ను పోలీసు అరెస్టు చేశారు. మరో వైపు రచ్చబండ కార్యక్రమానికి జగిత్యాల నుంచి వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అడ్డుకుని పోలీసులు గృహ నిర్భంధం చేశారు.
మరోవైపు కాంగ్రెస్ నేతలు రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ప్రకటిస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రచ్చబండ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నానని జగ్గారెడ్డి ప్రకటించగా ఆయన వ్యాఖ్యల్ని వి హనుమంతరావు తదితర నేతలు సమర్థించారు. రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు.
Also Read : నరేంద్రమోడీకి బానిస కెసిఆర్