Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Rachchabanda In Erravalli  :  పారబోయిల్ద్ రైస్ కొనబోమని కేంద్రం తేల్చి చెపితే, ఎలా కొనరో చూస్తానన్న కెసిఆర్ ఢిల్లీ లో అగ్గి సృష్టిస్త అన్నాడు మరి ఇప్పుడు ఎం చేస్తున్నాడని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రమంత్రి పియూష్ గోయల్ ను కలిసి యాసంగి పంట ఎంత కొంటారో తేల్చకుండా మంత్రులు ఢిల్లీలో నాటకాలు ఆడి వెళ్ళిపోయారు. కేంద్ర ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలుకు ఒక విధానం ఉందని పియూష్ గోయల్ తెలిపారు. 2020 ఖరీఫ్ సేజన్ లో FCI తో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చేసుకున్న ఒప్పందం ప్రకారం 25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఏడాది గడిచినా సరఫరా చేయలేదని, దీనికి సంబంధించి పొడగింపు చేసుకున్నారని కేంద్రమంత్రి వెల్లడించారు. అప్పటి బియ్యం గురించి మాట్లాడకుండా ఈ ఏడాది బియ్యం గురించి మాట్లాడుతున్నారని పియూష్ గోయల్ గడ్డి పెట్టి పంపారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి కెసిఆర్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. రైతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న విదాలపై రేవంత్ రెడ్డి మాటల్లోనే….

వరంగల్ FCI గోడౌన్ లో బియ్యం ఉన్నాయని కేంద్రం నుంచి నిధులు తీసుకున్న రాష్ట్రం ఆ తర్వాత అధికారులు తనికీ చేస్తే మాయమయ్యాయని కేంద్రమంత్రి ప్రశ్నిస్తే రాష్ట్ర మంత్రుల దగ్గర జవాబు లేదు. పార్లమెంటు సమావేశాల్లో సత్తా చూపుతామని చెప్పి సెంట్రల్ హాల్లో హడావిడి చేశారు.  హాలుకు సెంట్రల్ హాలుకు తేడా తెలియని సన్నాసులు తెరాస ఎంపిలు, వచ్చింది మూడు రోజులు తొమ్మిది మందిలో ఆరుగురు వస్తే ముగ్గురు రారు.

కాలక్షేపం చేసే సెంట్రల్ హాల్లో ఫోటోలు దిగి పంపితే కొన్ని పత్రికలు చాలా ప్రచారం ఇచ్చాయి. ఢిల్లీలో కాదు గల్లీలో తేలుస్తామని వచ్చి ఏం చేశారు. ఢిల్లీ నుంచి పారిపోయి వచ్చి వారం రోజులు చప్పుడు లేదు. ఆ తర్వాత చావు డప్పు కొడతామని చెప్పి కార్యక్రమం తీసుకొంటె కెసిఆర్ కుటుంబంలో ఎవరు పాల్గొనలేదు. చావు డప్పులో కెసిఆర్ కుటుంబం ఎందుకు పాల్గొనలేదు. నరేంద్ర మోడీ తో ఉన్న ఒప్పందం వల్లే కెసిఆర్ కుటుంబ సభ్యులు ఎవరు చావు డప్పులో పాల్గొనలేదు.

మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నాయకత్వంలో మంత్రుల బృందం ఢిల్లీ వచ్చింది. పార్లమెంటు నడిచేటపుడు ఢిల్లీలో ఉండని ఎంపిలు  ఇప్పుడు ఢిల్లీలో పొద్దున్న ముక్క, రాత్రి చుక్క తో ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి కేంద్రమంత్రిని కలిసి చేతులు దులుపుకున్నారు. ఆరు రోజులుగా ఢిల్లీ లో ఉంది మంత్రులు ఏం తేల్చారు. తెరాస నేతల కార్యాచరణ ఏంటో ప్రకటించాలి, ప్రజలకు వివరించాలి.

ఖరీఫ్ లో తెలంగాణ నుంచి ఎంత పంట వచ్చినా కొనుగోలు చేస్తామని, వివరాలు వెల్లడించాలని కేంద్రం అడిగితే ఎందుకు వివరాలు వెల్లడించటం లేదు. నోటి మాటలు కాకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమి జరిగాయో బయట పెట్టాలి. గత సంవత్సరం ఎందుకు సరఫరా చేయలేదో వెల్లడించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నరేంద్రమోడికి బానిసగా వ్యవహరిస్తున్న కెసిఆర్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు. గతంలో రాష్ట్ర మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్ళిన కేటిఆర్ ఈ దఫా ఎందుకు వెళ్లలేదని, పార్లమెంటులో ఫోటోలు దిగిన సంతోష్ కుమార్ ఇప్పుడు ఎంపిల బృందంలో ఎందుకు లేరని అడిగారు.

కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి రచ్చబండ కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. రచ్చబండలో రైతుల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఈ నెల 27 వ తేదిన సిఎం ఫాం హౌస్ దగ్గర ఎర్రవల్లిలో రచ్చబండ నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

Also Read : బీజేపీ,టిఆర్ఎస్ ల పోలిటికల్ డ్రామా- రేవంత్

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com