Sunday, January 19, 2025
Homeసినిమానెలాఖరున కేజీఎఫ్ 2 ట్రైల‌ర్

నెలాఖరున కేజీఎఫ్ 2 ట్రైల‌ర్

KGF-2: క‌న్న‌డ స్టార్ హీరో య‌ష్, పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం కేజీఎఫ్. ఈ సినిమా ఒక్క క‌న్న‌డ‌లోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించ‌డంతో కేజీఎఫ్ 2 సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇందులో శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ త‌దిత‌రులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. కేజీఎఫ్ స‌క్స‌స్ అవ్వ‌డంతో అన్ని భాష‌ల్లో కేజీఎఫ్ 2 ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.
క‌రోనా కార‌ణంగా కేజీఎఫ్ 2వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. తాజాగా ఈరోజు కేజీఎఫ్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. సోషల్ మీడియా వేదికగా సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మార్చి 27న సాయంత్రం 06:40 గంటలకు రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా అనౌన్స్ చేశారు. హోంబలే పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్