Saturday, March 29, 2025
Homeతెలంగాణమంత్రి పువ్వాడ ఆకస్మిక తనిఖి

మంత్రి పువ్వాడ ఆకస్మిక తనిఖి

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం సింగరేణి మండలం రేలకాయలపల్లి గ్రామంలో రూ.1.20 కోట్లతో నిర్మించిన 24 డబుల్ బెడ్ రూం ఇళ్లను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్ ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.

ఆ తర్వాత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వైరా నియోజకవర్గం సింగరేణి మండలం విశ్వనాధపల్లి గ్రామంలో పలు రోడ్లు, డ్రైన్లు ఆకస్మిక తనిఖీ చేశారు.

గ్రామంలో డబూల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి తొలుత గ్రామంలో పరిశుధ్యాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామంలోని నిర్మిస్తున్న వైకుంఠధామం, కంపోస్ట్ షేడ్, డంపింగ్ యార్డ్ పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్