Saturday, February 22, 2025
HomeTrending Newsఇక రోడ్లపై ఎలక్ట్రికల్ ఆటో

ఇక రోడ్లపై ఎలక్ట్రికల్ ఆటో

పియాజియో (Piaggio) వేహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (PVPL) తయారు చేసిన ఎలక్ట్రికల్ త్రీ వీలర్ ప్యాసింజర్ ఆటో వాహనాలను లాంఛనంగా ప్రారంభించిన రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ . ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఎలక్ట్రికల్  ప్యాసింజర్ శ్రేణి ఆటోను నడిపిన మంత్రి పువ్వాడ.

పెరిగిపోతున్న పెట్రో ధరలకు ఎలక్ట్రిక్ వాహనాలతో కళ్ళెం వేయోచ్చని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. కాలుష్యం తగ్గించి పర్యావరణ అనుకూలంగా ఉండే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం తరపున ప్రోత్సహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఆటో రంగాలలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా అన్ని రంగాల ప్రజలకు అందుబాటులో ఉండే ఆటో లను తయారు చేసిన సంస్థను మంత్రి పువ్వాడ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్