Wednesday, April 17, 2024
HomeTrending Newsపెట్రోల్‌ పెరిగింది.. డీజిల్‌ తగ్గింది

పెట్రోల్‌ పెరిగింది.. డీజిల్‌ తగ్గింది

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కనివినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నాయి. పెంపు పరంపరకు ఆదివారం బ్రేక్ ఇచ్చిన విక్రయ సంస్థలు నేడు మళ్లీ పెట్రోల్‌ ధరలను పెంచాయి. అయితే, దాదాపు రెండు నెలల తర్వాత తొలిసారి డీజిల్‌ ధర తగ్గించడం విశేషం.

లీటర్‌ పెట్రోల్‌పై సోమవారం గరిష్ఠంగా 30 పైసలు పెంచగా.. లీటర్‌ డీజిల్‌పై 16 పైసల వరకు తగ్గించారు. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.19, డీజిల్‌  ధర రూ.89.72గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్‌ రూ.107.20, డీజిల్‌ రూ.97.29కి చేరాయి.

పెట్రోలు, డీజిల్‌ మూలధర తక్కువగానే ఉన్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేసే సుంకాలు, పన్నులు ఎక్కువగా ఉండటంతో పెట్రోలు ధర లీటరుకు వంద రూపాయలు దాటగా.. డీజిల్‌ ధర సైతం వందకు చేరువ అవుతోంది. కరోనాతో అన్ని రంగాలూ కుదేలై ప్రజల ఆదాయ స్థాయిలు పడిపోయినా.. కేంద్రం మాత్రం ఈ రెండు ఇంధనాలపై పన్నుల భారాన్ని మరింత పెంచింది. గతేడాది మార్చి వరకూ (2020 మార్చి 14 ముందు) ఉన్న పన్నును పరిశీలిస్తే.. లీటరు డీజిల్‌పై రూ.16 వరకు, పెట్రోలుపై రూ.13 మేర భారం పెరిగింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్