వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్-2023లో తొలిరోజు ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. ట్రావిస్ హెడ్- సీవెన్ స్మిత్ 251 పరుగుల అజేయమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఆట ముగిసే సమయానికి ఆసీస్ 3 వికెట్లకు 327 పరుగులు సాధించింది. హెడ్ 106 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ తో సెంచరీ పూర్తి చేశాడు.. ఆ తర్వాత స్మిత్ దూకుడు పెంచాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి హెడ్-156; స్మిత్-95 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఉదయం టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. రెండు పరుగుల వద్ద తొలి వికెట్ (ఖవాజా- డకౌట్) కోల్పోయింది. ఆ తర్వాత డేవిడ్ వార్నర్- లబుషేన్ లు రెండో వికెట్ కు 69 పరుగులు జోడించారు. అయితే ఐదు పరుగుల తేడాతో వీరిద్దరూ వెనుదిరిగారు. వార్నర్-43; లబుశేన్ -26 పరుగులు చేశారు. ఈ దశలో ట్రావిస్ హెడ్ – స్టీవెన్ స్మిత్ లు ఇన్నింగ్స్ గాడిలో పెట్టారు. ఓ వైపు హెడ్ దూకుడుగా ఆడగా, మరోవైపు స్మిత్ నెమ్మదిగా ఆడుతూ అడపా దడపా పరుగులు సాధించాడు.
ఇండియా బౌలర్లలో సిరాజ్, షమీ, శార్దూల్ తలా ఒక వికెట్ సాధించారు.