Thursday, September 19, 2024
HomeTrending Newsచెట్టును చుట్టిన ఇల్లు

చెట్టును చుట్టిన ఇల్లు

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు… అంటూ ఆనందంగా గడిపేస్తున్నాడో పెద్దాయన. అవును మరి,చిన్న చిన్న కారణాలకే చెట్లు కొట్టేయడం తెలుసు కానీ చెట్టు చుట్టూ ఇల్లు కట్టుకుని తానూ ఎదిగిన వైనం అబ్బురమే !
ఉదయపూర్ లో స్థిరపడ్డ వ్యాపారి కుల్ ప్రదీప్ సింగ్. ఆ ప్రాంతమంతా పండ్ల చెట్లకు ప్రసిద్ధి. ఒకప్పుడు ఆ పళ్ళు అమ్ముకునే వాళ్ళంతా ఇళ్లకోసం చెట్లు కొట్టేయడం ప్రారంభించారు. అదిచూసి ఎంతో బాధపడ్డ కుల్దీప్ తాను కట్టే ఇంటివల్ల చెట్టు కొట్టకూడదనుకున్నారు. మధ్యలో 20 అడుగుల మామిడిచెట్టు ఉన్న స్థలం కొనుగోలు చేశారు. ఒక ఏడాది లో ఇల్లు పూర్తయింది.

నాలుగువైపులా సిమెంట్ పిల్లర్స్ కట్టి మొత్తం ఐరన్ ఫ్రేమ్స్ తో గోడలను ఫైబర్ తో నిర్మించారు. చెట్టు కాండమే ఆధారంగా నేలకు ఎనిమిది అడుగుల ఎత్తులో ఇల్లు ఉంటుంది. కింద వంటగది, డైనింగ్ హాల్, బాత్రూమ్, మొదటి అంతస్తులో బెడ్ రూమ్, లైబ్రరీ ఉంటాయి. ఎక్కడ చూసినా చెట్టు కనిపిస్తూనే ఉంటుంది. గత పదేళ్లలో మామిడి చెట్టు ఇంకో ఇరవై అడుగులు పెరిగింది. దాంతో కులదీప్ మరో రూమ్ నిర్మించారు. అయితే ఈ గది పై కప్పు తెరుచుకునే విధంగా ఉండి తెరవగానే చెట్టు పలకరిస్తుంది. ఏటా మామిడికాయలు చేతికందుతాయి. కుల్దీప్, భార్య, కొడుకు ఈ ఇంట్లో ఎంతో సంతోషంగా ఉన్నారు. అన్నట్టు ఈ ఇల్లు లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ లో కూడా నమోదైంది. ఈసారి ఉదయపూర్ వెళ్తే తప్పకుండా ఈ ఇల్లు చూసేయండి మరి!

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్