Saturday, January 18, 2025
Homeసినిమా'ఆహా' ఫ్లాట్ ఫామ్ పై అనూహ్యమైన రెస్పాన్స్ తో 'పిండం'

‘ఆహా’ ఫ్లాట్ ఫామ్ పై అనూహ్యమైన రెస్పాన్స్ తో ‘పిండం’

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి మంచి మార్కులు కొట్టేసిన సినిమాల జాబితాలో ‘పిండం’ ఒకటిగా కనిపిస్తుంది. సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించిన ఈ సినిమా, డిసెంబర్ 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. పోస్టర్స్ తోనే ఆసక్తిని రేకెత్తించడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయింది.  శ్రీరామ్ కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమా, హారర్ థ్రిల్లర్ జోనర్లో ప్రేక్షకులను పలకరించింది. చిన్న సినిమానే అయినప్పటికీ, జోనర్ కి తగినట్టుగా భయపెట్టగలిగింది.

అలాంటి ఈ సినిమా ఈ నెల 2వ తేదీ నుంచి ‘ఆహా’ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చింది. సాధారణంగా హారర్ థ్రిల్లర్ సినిమాలను థియేటర్లో చూడటానికి ఒక వర్గం ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే కనెక్ట్ అయ్యే ఆడియన్స్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. ‘ఆహా’లో ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకెళుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక చిన్నపాప చుట్టూ తిరిగే ఈ కంటెంట్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.

హీరో ఒక విలేజ్ కి దగ్గరలో ఉండే బంగ్లాను కొనుగోలు చేస్తాడు. గతంలో ఆ బంగ్లాలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన కారణంగా అందులో ప్రేతాత్మలు తిరుగుతూ ఉంటాయి. ఓ ప్రేతాత్మ హీరో చిన్న కూతురును ఆవహిస్తుంది. ఫలితంగా ఆ ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసిందనేదే కథ. హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధానమైన బలంగా నిలుస్తాయి. ఆ రెండింటి బలమే ఈ సినిమాకి ఈ స్థాయి రెస్పాన్స్ రావడానికి కారణమని చెప్పచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్