Sunday, May 19, 2024
HomeTrending Newsలోకేష్ ను దాచిపెట్టారు: అంబటి ఎద్దేవా

లోకేష్ ను దాచిపెట్టారు: అంబటి ఎద్దేవా

జనసేన కార్యకర్తలు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదే ప్రయత్నం చేయవద్దని…. చంద్రబాబు మాట విని పవన్ కల్యాణ్  తన పార్టీ శ్రేణులను నిలువునా ముంచుతాడని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి  అంబటి రాంబాబు హెచ్చరించారు. బాబు ఇంటికి పవన్ కల్యాణ్ నిన్న ఉదయం, సాయంత్రం వెళ్లి వచ్చాడని, ప్యాకేజీ ముష్ఠి కోసం వెళ్ళాడా? సీట్లు ముష్ఠి కోసం వెళ్లాడా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ముష్ఠి తీసుకునే పరిస్థితి తప్ప గత్యంతరం లేని పరిస్థితి  ఉందని, రోజూ తిరగడమే పని తప్ప ఫలితం ఉండదని, 20-25 సీట్లు ఇవ్వడమే గగనమని, ఇది అందరికి తెలిసిన సత్యం అని రాంబాబు వ్యాఖ్యానించారు.

సక్సెస్ ఫుల్ సీఎంగా జగన్ రాష్ట్ర చరిత్రలో నిలబడిపోతారని, గతంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండో సారి ఏ విధంగా నిలబడ్డారో, ఇప్పుడు సీఎం జగన్ మళ్ళీ గెలిచి రికార్డ్ సృష్టించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని పద్మవ్యూహాలు పన్నినా, ఎందరు కలిసి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని చీలికలు చేసినా, చరిత్రలో నిలబడే విజయాన్ని జగన్ సాధించబోతున్నారని స్పష్టం చేశారు.

తమ పార్టీలో టికెట్ లేని బఫూన్ లు వేరే పార్టీలో చేరతారని,  ఇక్కడ టికెట్ లేదని చెప్పిన తర్వాత బఫూన్ బాలశౌరి వెళ్లి అక్కడ చేరి ఓవర్ గా మాట్లాడాడని అంబటి విమర్శించారు. ఓవరాక్షన్ చేస్తేనే తప్ప గుర్తించబోమని చెప్పినట్లు ఉన్నారని అందుకే చాలా ప్రగల్భాలు పలికాడని, అది చూసి పవన్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని ఎద్దేవా చేశారు.  బాలశౌరి చరిత్ర అంతా తెలుసని, ఇక్కడ  తంతే వెళ్ళి జనసేన ఆఫీస్ లో పడ్డాడని, అన్యాయాలు, అక్రమాలు చేసిన బఫూన్ బాలశౌరి అంటూ తీవ్రంగా విమర్శించారు.  అన్యాయాలు, అక్రమాలు చేశాడు కాబట్టే టికెట్ రిజెక్ట్ చేశారని, ఆ తర్వాతే జనసేన ఆఫీసులో తేలాడన్నారు.

లోకేష్ ను బైటకు పంపిస్తే టీడీపీ ఔట్ అని  ఎవరో చెప్పినట్టున్నారని, అందుకే ఈ మధ్య ఆయన్ను దాచిపెట్టినట్లుఉన్నారని రాంబాబు చమత్కరించారు. లోకేష్ ను దాచేసినా, బయట పెట్టినా టీడీపీ ఔటేనని, ఇదే వాస్తవమని… పొత్తులు పెట్టుకున్నా, కూటమి కట్టినా రాష్ట్ర ప్రజలు వారిని నమ్మబోరని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్