Saturday, January 18, 2025
Homeసినిమాసంక్రాంతి పోటీలో విజేత‌గా నిలిచేదెవ‌రు..?

సంక్రాంతి పోటీలో విజేత‌గా నిలిచేదెవ‌రు..?

సంక్రాంతికి ప్ర‌తి సంవ‌త్స‌రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి పోటీ ఉంటుందో తెలిసిందే. ఈ సంక్రాంతికి రానున్న సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ‘ఆదిపురుష్’ గురించి. ప్ర‌భాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓంరౌత్ తెరకెక్కించిన భారీ, క్రేజీ మూవీ ఆదిపురుష్‌. రామాయ‌ణం ఆధారంగా ఆదిపురుష్ చిత్రం రూపొందింది. ఈ సంచ‌ల‌న చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయ‌నున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలెంటెడ్  డైరెక్ట‌ర్ బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వాల్తేరు వీర‌య్య‌’. ఈ చిత్రం మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై రూపొందుతోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ వైజాగ్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. చిరంజీవి స‌ర‌స‌న అందాల తార శృతిహాస‌న్ న‌టిస్తుంది. ర‌వితేజ కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. కాగా ఈ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

 వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా న‌టిస్తున్న ‘వార‌సుడు’ మూవీ కూడా సంక్రాంతికి రానుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. విజ‌య్ స‌ర‌స‌న హీరోయిన్ ర‌ష్మిక న‌టిస్తుంది. అయితే.. బాల‌య్య సినిమా కూడా సంక్రాంతికి వ‌స్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది కానీ.. సంక్రాంతి కంటే ముందుగానే ‘బాల‌య్య’ సినిమా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. సో.. సంక్రాంతికి ఆదిపురుష్, వాల్తేరు వీర‌య్య‌, వార‌సుడు సినిమాల మ‌ధ్యే పోటీ. మ‌రి.. ఈ పోటీలో విజేత‌గా ఎవ‌రు నిలుస్తారో చూడాలి.

Also Read : సంక్రాంతికి పోటీకి సై అంటున్న చిరు, బాల‌య్య‌..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్