Friday, March 29, 2024
Homeసినిమాఅంచ‌నాలు రెట్టింపు చేసిన ఘోస్ట్ ట్రైల‌ర్

అంచ‌నాలు రెట్టింపు చేసిన ఘోస్ట్ ట్రైల‌ర్

టాలీవుడ్ కింగ్ నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేష‌న్లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ‘ది ఘోస్ట్’. ద‌స‌రా  అక్టోబ‌ర్ 5న ‘ది ఘోస్ట్’ మూవీ విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడటంతో చిత్ర నిర్మాతలు ప్రమోషన్ల జోరు పెంచారు. థియేట్రికల్ ట్రైలర్‌తో సినిమా పై భారీ అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా రిలీజ్ ట్రైలర్‌ని విడుదల చేశారు. థియేట్రికల్ ట్రైలర్ లాగానే రిలీజ్ ట్రైలర్ కూడా యాక్షన్ తో పాటు అన్ని కమర్షియల్ హంగులతో ఆకట్టుకుంది.

ది ఘోస్ట్‌గా నాగార్జున పాత్రకు బిగినింగ్ యాక్షన్ బ్లాక్ హైవోల్టేజ్ ఎలివేషన్ ఇస్తుంది. ”డబ్బు, సక్సెస్ ఆనందం కంటే శత్రువులను ఎక్కువ తెస్తుంది” అని నాగార్జున చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇందులో నాగార్జునకి చాలా మంది శత్రువులు ఉన్నారు. అండర్ వరల్డ్ నుండి అతని సోదరి కుటుంబాన్ని రక్షించే బాధ్యతను తీసుకోవడంతో శత్రువుల జాబితా మరింత పెరుగుతుంది. ట్రైలర్ లో నాగార్జున హైలీ ఇంటెన్స్ గా కనిపించి డెడ్లీ స్టంట్స్ లో ఆశ్చర్యపరిచారు. స్టైలిష్ ,యాక్షన్ థ్రిల్లర్‌లను డీల్ చేయడంలో స్పెషలిస్టయిన ప్రవీణ్ సత్తారు యాక్షన్ సినిమా ప్రేమికులకు ది ఘోస్ట్ ని ఫుల్ మీల్ ఫీస్ట్ గా తీర్చిదిద్దారు.

అలాగే ఇందులో ఫ్యామిలీ, యూత్ ఎలిమెంట్స్ కూడా వున్నాయి. నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్ గా కనిపించారు. నాగార్జున సోదరిగా గుల్ పనాగ్, మేనకోడలుగా అనిఖా సురేంద్రన్ పాత్రలు కూడా ఆసక్తికరంగా వున్నాయి.
రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ లాంచ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ.. నారాయణ్ దాస్ నారంగ్ గారికి నాతో సినిమా తీయాలని కోరిక. అలా ఈ సినిమా మొదలైయింది. ముందుగా నిర్మాతలు సునీల్ నారంగ్ పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ గారికి కృతజ్ఞతలు. ‘ది ఘోస్ట్’ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా గొప్ప నిర్మాణ విలువలతో తీశారు. ఈ సినిమాని ఒక కసితో తీశాం. ఇందులో సాంకేతిక విలువలు నెక్స్ట్ లెవల్ లో వుంటాయి.

దర్శకుడు ప్రవీణ్ తో పాటు మిగతా సాంకేతిక నిపుణులు అంతా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ ట్రైలర్ ని కూడా ప్రవీణ్ అద్భుతంగా కట్ చేశారు. ఒక కాన్సెప్ట్ తో వున్న కంటెంట్ ఇది. సినిమా కోసం చాలా ఎక్సయిట్ గా ఎదురుచూస్తున్నాం. అనంతపురం ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి గారు మా సినిమాకి బెస్ట్ విశేష్ అందించడం చాలా అనందంగా వుంది. చిరంజీవి గారికి కృతజ్ఞతలు. విడుదలౌతున్న అన్ని సినిమాలు అద్భుతంగా ఆడాలి” అని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్