Friday, September 20, 2024
HomeTrending NewsMahua Moitra: తృణముల్ ఎంపి లోకసభ సభ్యత్వం రద్దు

Mahua Moitra: తృణముల్ ఎంపి లోకసభ సభ్యత్వం రద్దు

తృణముల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా లోకసభ సభ్యత్వం రద్దు చేస్తూ ఈ రోజు(డిసెంబర్-8) కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం సంచలనం రేపింది. ఎంపీగా తన లాగిన్ వివరాలు ఇతరులతో పంచుకున్నందుకు, వ్యాపారవేత్త నుండి బహుమతులు స్వీకరించినందుకు దోషిగా తేలినందున ఈ నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కమలనాథులు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి పక్షాలు లోకసభ నుంచి వాకౌట్ చేశాయి. సంబంధిత ఎంపికి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఎంపీ తరపున లోకసభ వెబ్ సైట్ లాగిన్ వివరాలు అనేది బహుశ దేశంలో ఏ పార్లమెంటు సభ్యుడు వ్యక్తిగతంగా ఉపయోగించరనే చెప్పాలి. సాధారణంగా వారి వ్యక్తిగత సహాయకులే ఎంపి తరపున నిర్వహిస్తారు. నోటుకు ప్రశ్న కేసుపై పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ విచారణకు హాజరైనపుడు మహువా సమాధానం కమిటిని సంతృప్తి పరచలేదు. అది అందరు చేసే పనే కదా అందులో కొత్త ఏముందని ఘాటుగా స్పందించటం సమస్య ముదిరేలా చేసింది.

ఎంపి అభ్యర్ధన ధోరణలో వెళతారనుకుంటే అది జరగకపోగా ఎదురుదాడికి దిగింది. దీంతో తాడో పేడో తేల్చేందుకు బిజెపి సిద్దం అయింది. మహువా మొయిత్రా నోటుకు ప్రశ్నల వ్యవహారంపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా దానిని సాధారణ కేసుగా మార్చాలా లేక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా అన్నది సీబీఐ పరిశీలిస్తోంది. ఈ లోపే కేంద్రం మహువా మొయిత్రాను లోక్ సభను బహిష్కరించటం గమనార్హం. గతంలో యూపీఏ హయాంలో ఓటుకు ప్రశ్నల కేసులో కాంగ్రెస్ పార్టీ.. 10 మంది ఎంపీల్ని ఒక్కరోజులోనే బహిష్కరించిన విషయాన్ని బీజేపీ గుర్తుచేస్తోంది.

మహువా మీద ఆరోపణలు వస్తుండగానే తరుణముల అధినేత్రి మమత బెనర్జీ…పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించారు. పార్టీని అప్రతిష్ట పాలు చేసేందుకు బిజెపి కుట్ర చేసిందని తృణముల్ నాయకత్వం భావిస్తోంది. ఉన్నత విద్యావంతురైలైన మహువా ఎంపిగా ప్రభుత్వంపై మొదటి నుంచి విమర్శలు ఎక్కుపెట్టారు. ఆదానిపై ఆరోపణలు ముంచాయని అంటున్నారు.

మహువా ఆరోపణలు…కేంద్రం చర్యలు చూస్తుంటే ఇపుడు జరుగుతున్న దానికి వాస్తవానికి సంబంధం లేదు అనిపిస్తోంది. తెరవెనుక రాజకీయాల్లో మహువా మీద వేటు పడిందని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మహువా వ్యవహారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణముల్ పార్టీకి మేలు చేస్తుందని అనిపిస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నపుడు, ప్రస్తుతం ఎంపిగా మహువా మీద రాష్ట్రంలో ఎలాంటి ఆరోపణలు లేవు. ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా పేరుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్