Trinamool Congress Team To Nagaland :
మోన్ జిల్లా మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. దుర్ఘటనపై మిలిటరీ బలగాలు విచారం వ్యక్తం చేసింది. అయితే స్థానికి నాగ యువత మాత్రం శాంతించటం లేదు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అల్లర్లు, హిసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముందు జాగ్రత్తగా నాగాలాండ్ లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల సమస్యల్ని పరిష్కరించటం లేదని, అభివృద్దిలో భాగస్వామ్యం లేదని ఈ రోజు గౌహతి, ఇంపాల్, సిల్చేర్ తదితర నగరాల్లో నాగాలకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
నాగాలాండ్ లో జరిగిన ఘటనలను టెర్రరిస్టులు అవకాశంగా మలచుకునే ప్రమాదం పొంచి ఉండటంతో పెద్ద సంఖ్యలో మిలిటరీ బలగాలను మోన్ జిల్లాలో మొహరించారు. నాగాలాండ్ కు చెందిన ఎన్.సి.ఎస్.ఎన్.(NSCN), అస్సాం కు చెందిన ఉల్ఫా(ULFA) తీవ్రవాదులు స్థానికులను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని నిఘా వర్ఘాలకు సమాచారం వచ్చింది. మోన్ జిల్లా టిరు ప్రాంతంలో కొందరు స్థానికులు వివిధ వాహనాల్లో వచ్చిభద్రతా బలగాలపై కాల్పులకు యత్నించగా వారు చాకచక్యంగా తిప్పికొట్టారు.
మరోవైపు ఈ దుర్ఘటనలో చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు ఈ రోజు తృణముల్ కాంగ్రెస్ బృందం నాగాలాండ్ రాజధాని కొహిమ వెళుతోంది. బాధిత కుటుంబాలను కలిసి నిజానిజాలను తెలుసుకునేందుకు టి.ఎం.సి. ఎంపి సుష్మిత దేవ్ నేతృత్వంలో ప్రతినిధి బృందం రాష్ట్రంలో పర్యటించనుంది .
Also Read : కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ కు భంగపాటు