Saturday, January 18, 2025
Homeసినిమావెంకీ జోడీగా త్రిష ఖాయమైనట్టే!

వెంకీ జోడీగా త్రిష ఖాయమైనట్టే!

వెంకటేశ్ – త్రిష పేరు వినిపించగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’. కథాకథనాల పరంగా .. పాటల పరంగా ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఆ తరువాత ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమా ‘నమో వేంకటేశ’. ఈ సినిమాకి ఆ సమయంలో ఫ్లాప్ టాక్ వచ్చినా, ఇప్పటికీ టీవీలలో మంచి రేటింగ్ తెచ్చుకుంటోంది. ఈ జంట ఇప్పుడు మరోసారి కలిసి తెరపై సందడి చేయనుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. అది ఖాయమైపోయిందనేది తాజా సమాచారం.

ప్రస్తుతం వెంకటేశ్ .. అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా ఉన్నారు. వాళ్ల కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ తరువాతనే ‘నందు’ దర్శకత్వంలో వెంకటేశ్ సినిమా మొదలు కానుంది. ‘సామజవరగమన’ సినిమాకి రైటర్ గా పనిచేసిన నందు, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. దసరాకి ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరపనున్నారని తెలుస్తోంది.

ఇక త్రిష విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో ఆమె కెరియర్ మరింత జోరందుకుంది. గతంలో కంటే మరింత గ్లామరస్ గా త్రిష తయారైంది. దాంతో అటు తమిళంలోను .. ఇటు తెలుగులోను సీనియర్ స్టార్ హీరోల జోడీగా ముందు ఆమె పేరునే పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ జాబితాలో ఆల్రెడీ చిరంజీవి సినిమా ఉండగా, తాజాగా   వెంకటేశ్ సినిమా కూడా చేరిపోయినట్టుగా చెబుతున్నారు. 2025 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్