Saturday, January 18, 2025
Homeసినిమాప్రభాస్ జోడీగా కనిపించనున్న త్రిష?

ప్రభాస్ జోడీగా కనిపించనున్న త్రిష?

త్రిష గ్లామర్ ఇప్పుడు కొత్త కథానాయికలకు ఎంతమాత్రం తీసిపోవడం లేదు. మునుపటికన్నా మరింత గ్లామరస్ గా ఆమె కనిపిస్తోంది. దాంతో సీనియర్ స్టార్ హీరోలు ఆమెకి తమ సినిమాలలో ఛాన్స్ ఇస్తున్నారు. అలా ఆమె ప్రభాస్ సినిమాలోను అవకాశాన్ని దక్కించుకుందని అంటున్నారు,. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ ప్రస్తుతం మారుతి సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘రాజా సాబ్’ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. పూర్తి వినోదభరితంగా గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ ఇది.

ఇక ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలోను ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమా ఈ నెల 17వ తేదీన పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగు తున్నాయి. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలెట్టనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ తరువాత ప్లానింగ్ మారినట్టుగా తెలుస్తోంది. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెడతారనేది తాజా సమాచారం. స్వాతంత్య్రం రాకముందు జరిగే కథ ఇది.

ఈ సినిమాలో కథానాయికగా మృణాల్ ఠాకూర్ ను తీసుకోనున్నట్టుగ చెప్పుకున్నారు. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. రీసెంటుగా త్రిష పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాకి కాస్త పరిణతి కలిగిన నాయిక అవసరం ఉండటం .. నటనకి అవకాశం ఉన్న పాత్ర కావడం వలన త్రిషను సంప్రదిస్తున్నారనే టాక్ బయటికి వచ్చింది. ప్రభాస్ – త్రిష జోడీగా చక్కగా ఉంటుందనడానికి నిదర్శనంగా  గతంలో వచ్చిన ‘వర్షం’ .. ‘పౌర్ణమి’ వంటి సినిమాలు కనిపిస్తాయి. ఈ వార్త త్రిష దగ్గరే ఆగుతుందా? మరింత ముందుకు వెళుతుందా? అనేది చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్