Wednesday, June 26, 2024
Homeసినిమాత్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్ లో విజ‌య్?

త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్ లో విజ‌య్?

Rare Combination! సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం లైగ‌ర్ మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ లో రూపొందుతోన్న లైగ‌ర్ షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండకి ఆమ‌ధ్య‌ రెండు ఫ్లాపులు పడ్డాయి. దాంతో లైగ‌ర్ మూవీని త్వ‌ర‌గా రిలీజ్ చేయాలి అనుకున్నాడు కానీ క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌డం జ‌రిగింది. విజ‌య్.. సుకుమార్ తోను.. శివ నిర్వాణతోను సినిమాలు చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. పుష్ప 2తో సుకుమార్ బిజీ కానున్నాడు. అందుచేత సుకుమార్ తో మూవీకి టైమ్ ప‌డుతుంది. అలాగే జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌డానికి కూడా టైమ్ ప‌డుతుంది. కనుక శివ నిర్వాణతో విజయ్ దేవరకొండ సినిమా స్టార్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా త్రివిక్రమ్ పేరు తెరపైకి వచ్చింది.

విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్న దర్శకులు ఆయనను కలిస్తే, త్రివిక్రమ్ తో సినిమా పూర్తయిన తరువాత చూద్దాం అంటున్నాడట. మహేష్‌ బాబుతో సినిమా తరువాత త్రివిక్రమ్ చేసే సినిమా విజయ్ దేవరకొండతోనే అని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. నిజంగానే విజ‌య్ తో త్రివిక్ర‌మ్ మూవీ ఉందా..?  ఉంటే.. ఎప్పుడు ఉంటుంది.? అనేది తెలియాల్సివుంది.

 

Also Read : విజ‌య్ మూవీకి నో చెప్పిన కైరా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్