Friday, March 29, 2024
HomeTrending Newsతెలంగాణతో కేసిఆర్ బంధం తెగిపోయింది - ఈటెల రాజేందర్

తెలంగాణతో కేసిఆర్ బంధం తెగిపోయింది – ఈటెల రాజేందర్

భారత రాష్ట్ర సమితి (BRS) ప్రకటనతో తెలంగాణకు కేసిఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసిఆర్ BRS ప్రకటనపై స్పందించిన ఈటల రాజేందర్ ఉద్యమ పార్టీని కతం పట్టించి, ఉద్యమకారులను మరిచిపోయేటట్టు చేసి కెసిఆర్ ముద్ర ఉండే పార్టీని స్థాపించారని విమర్శించారు. ఆ పార్టీస్థాపనతోనే తెలంగాణకి కెసిఆర్ కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది. తెలంగాణ ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీకి ఉండే బంధం తెగిపోయింది. తెలంగాణఉద్యమకారులకు, తెలంగాణ చైతన్యానికి కెసిఆర్ కి ఉన్న బంధం తెగిపోయిందని ఈటెల అన్నారు.

కెసిఆర్ బిఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న తరువాత ఆయన నమ్ముకుంది మద్యాన్ని, డబ్బుని ప్రలోభాలను అని ఈటెల ఘాటుగా విమర్శించారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయం చేయాలని కల పగటికలకంటున్నారని ఎద్దేవా చేశారు. అది కలగా మిగిలిపోతుందని అన్నారు. ఒకటి నిజం కూట్లో రాయి తీయలేనివాడు ఎట్లో రాయి తీయడానికి పోయినట్టు ఉందన్నారు.

తెలంగాణలో సమస్యలు పరిష్కరించలేనివాడు.. అనేక రకాలుగా ప్రజల విశ్వాసం కోల్పోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు.. ఆ సంప్రదాయాన్ని ఆ దుఃఖాన్ని దేశం మీద రుద్దే ప్రయత్నం కెసిఆర్ చేస్తున్నారు అని ఈటల రాజేందర్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్