Sunday, February 23, 2025
HomeTrending Newsకాంగ్రెస్ లోకి తీగల?

కాంగ్రెస్ లోకి తీగల?

Joining: మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయమై వచ్చే వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై నేడు తీగల విమర్శలు చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో కబ్జాలు జరుగుతున్నాయని, వక్ఫ్ భూములు, స్కూళ్ళ స్థలాలు కూడా వదలకుండా ఆక్రమిస్తున్నారని సబితా అనుచరులపై తీగల మండిపడ్డారు. మీర్ పేటను సబిత నాశనం చేశారని ఆరోపించారు. సబిత, ఆమె అనుచరుల వ్యవహారంపై సిఎం కేసిఆర్ తో తాను మాట్లాడతానని తీగల చెప్పారు.

అయితే ఆయన టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్  పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని, అందుకే  మంత్రి సబితపై విమర్శలు చేస్తున్నారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే నెలలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్తారని తెలుస్తోంది.

Also Read : కాంగ్రెస్ లోకి విజయారెడ్డి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్